చక్రాలు

Mar 4,2024 10:00 #feachers, #kavithalu

ముందుకు ఒకటి

చక్రాలు

వెనుకకు ఒకటి

సైకిల్‌ చక్రాలు

ముందుకు రెండు

వెనుకకు రెండు

కారుకు చక్రాలు

ముందుకు ఒకటి

వెనుకకు రెండు

ఆటో చక్రాలు

రెండు వైపుల

అటునిటు పెద్దవి

జట్కా చక్రాలు

కుమ్మరి సారెను

గిరగిర తిప్పగ

ఉండును ఒక చక్రం

దీపావళిలో

గిరగిర నేలను

తిరుగును భూచక్రం

మూడు రంగుల

మన జెండాలో

మధ్యన ఒక చక్రం

చదువెగ్గొడితే

పరీక్షలప్పుడు

తిరిగే బుర్ర చక్రం.. చక్రం..

– ఎన్‌.వి.ఆర్‌.సత్యనారాయణమూర్తి

➡️