బుడి బుడి అడుగులు

Mar 18,2024 06:17 #chinnari, #feachers, #jeevana

బుడి బుడి అడుగుల బుడ్డోడా
పడుతూ లేచే చిన్నోడా
బోసి నవ్వులు నవ్వేవాడా
మాకు సంతోషాన్ని ఇచ్చే వాడా

వచ్చీ రాని మాటలతో అలరించే వాడా
టాటా అంటూ చేతులూపేవాడా
అర్థమైందంటూ తల ఆడించేవాడా
నీ చేష్టలతో మమ్ము మురిపించేవాడా

ఫోజులెన్నో ఇచ్చే వాడా
అమ్మమ్మతో గోరు ముద్దలు తినే వాడా
తాతయ్యతో షికారు వెళ్ళే వాడా
ఎంచక్కా రాగాలు తీసే వాడా
అమ్మ కనపడగానే ఒళ్ళో చేరే వాడా
హాయిగా ఆడుకుని బజ్జుకునే వాడా!

– కనుమ ఎల్లారెడ్డి, ఆస్టిన్‌, టెక్సస్‌ స్టేట్‌,

అమెరికా, 93915 23027.

➡️