ఈ టీతో చలికాలం సమస్యలకు చెక్‌

Jan 8,2024 10:50 #feature

లికాలంలో ఆహారం, ఆరోగ్యంతో పాటు జీవనశైలిలో కొన్ని రకాల మార్పులు తప్పనిసరి. ఈ కాలంలో జామ ఆకు టీని తీసుకోవడం వల్ల అనేక సమస్యలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

  • జామ ఆకు టీని రోజూ ఉదయం తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ ఆకులలో విటమిన్‌ సి అధిక స్థాయిలో ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు ఇన్ఫెక్షన్‌లతో పోరాడటానికి సహాయపడే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌ ఇందులో ఉంటాయి.
  • ఈ టీని రోజూ తాగడం వల్ల గొంతు మంట తగ్గడంతో పాటుగా ఈ కాలంలో ఎక్కువగా బాధించే దగ్గు, జలుబు వంటి సమస్యలు కూడా పూర్తిగా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
  • చలికాలంలో ఎక్కువగా అజీర్ణం, ఉబ్బరం, మలబద్దకం వంటి జీర్ణ సమస్యలు వేధిస్తుంటాయి. యాంటీ బాక్టీరియల్‌ లక్షణాలు జామ ఆకుల్లో పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఈ టీ తాగడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు.
  • జామ ఆకు టీని క్రమం తప్పకుండా తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌ అవుతాయి.ొ ఈ టీలో విటమిన్‌ సి అధికంగా ఉండటం వల్ల చర్మ సమస్యలు కూడా పూర్తిగా తగ్గుతాయి.
➡️