కోడిగుడ్డులో పోషకాలు మెండు

Apr 3,2024 04:45 #Jeevana Stories

కోడిగుడ్డులోని ప్రొటీన్‌ శరీరానికి శక్తిని అందించటమే కాకుండా కంటి చూపు మెరుగ్గా ఉంచేందుకు దోహదపడుతుంది. ప్రతిరోజూ గుడ్డు తినేవారిలో కంటి సమస్యలు తక్కువగా వస్తాయి. కంటిచూపు మందగించటం వంటి సమస్యలను అధిగమించేలా గుడ్డులో ఉండే జింక్‌, విటమిన్‌-ఇ వంటివి తోడ్పడతాయి. విటమిన్‌ాడి కూడా పుష్కలంగా ఉంటుంది. శరీరానికి ఎండ తగలకపోవటం, సరైన పోషకాహారం తీసుకోకపోవటం వల్ల ప్రస్తుతం అత్యధికులు విటమిన్‌ాడి లోపంతో బాధపడుతున్నారు. గుడ్డులో ఉండే అమైనో ఆమ్లాలు అధికంగా శారీరక శ్రమ చేసిన వారు తిరిగి శక్తిని పుంజుకోవటానికి ఉపయోగపడతాయి. కాలేయ జబ్బులు, ధమనులు, నాడీ సమస్యలు ఎదురుకాకుండా చూసేందుకు గుడ్డులో ఉన్న కోలిన్‌ పనిచేస్తుంది. గర్భిణులకు కాల్షియం గుడ్డు ద్వారానే అందుతుంది. సల్ఫర్‌, పలు రకాల విటమిన్లు, లవణాల వల్ల జట్టుకి మంచి పోషణ కూడా అందుతుంది. ఉడికించిన గుడ్డులో విటమిన్‌-డితోపాటు మినరల్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. గోళ్లు పొడిబారిపోకుండా కాపాడతాయి. ఒక గుడ్డు తినటం వల్ల సుమారుగా 70 నుంచి 80 క్యాలరీలు, 6 గ్రాముల ప్రొటీన్లు, 5 గ్రాముల కొవ్వులు, 190 గ్రాముల కొలెస్ట్రాల్‌ శరీరానికి అందుతాయి.

➡️