ఎవరికి వారే!

Mar 20,2024 06:02 #feachers, #jeevana

కుందేలమ్మా కుందేలు
నల్లని, తెల్లని కుందేలు
ఎర్రని కేరట్‌ అంటే చాలు
ఎగిరి గంతేసే కుందేలు.

తాబేలమ్మా, తాబేలు
బుడి బుడి నడకల తాబేలు
నెమ్మదిగా నడిచిన గానీ
గమ్యాన్ని చక్కగ చేరు.

చిలకమ్మ చిలకమ్మా
పచ్చని చక్కని చిలకమ్మ
కొమ్మన కూర్చుని కూసేవమ్మా
కమ్మని కబుర్లు చెప్పమ్మా!

ఉడుతా ఉడుతా చారల ఉడుత
బారెడు తోకతో పరిగిడు బుడత
కీచు కీచు మని తోకను ఊపు
స్నేహం కోసం చేతులు చాపు.

మ్యావు మ్యావు నల్లని పిల్లి
సడీ చప్పుడు చేయని బిల్లీ
పాలు పెరుగు వుండనివ్వదు.
రాక పోకలు అసలు తెలీదు.

పాప పాప చిన్నారి పాప
చదువుల తల్లి, సిరిగల మల్లి.
అమ్మా నాన్న కన్నుల పంట.
ఇంటికి దీపం ఆమె నంట!

– కూచిమంచి నాగేంద్ర
91821 27880

➡️