మెరుగైన ఆరోగ్యం కోసం ఆచి తూచి తినాలి …

Feb 5,2024 11:04 #feature

ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మంచి ఆహారాన్ని తీసుకోవాలి. పోషకాహారం ప్రతిఒక్కరికీ చాలా ముఖ్యం. మరి ఈ పోషకాహారం ఎందులో ఉందో తెలుసుకోవటం అవసరం. కొన్ని రకాల ఆహారాల్లో ఎక్కువ పోషకాలుంటాయి. మరికొన్నింటిలో తక్కువగా ఉంటాయి. ఆయా ఆహారాల కొనుగోలుకు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి కూడా ఉంటుంది. ఖరీదు ఎక్కువ అని పక్కన పెట్టేయకుండా అప్పుడప్పుడైనా మన డైట్‌లో చేర్చుకోవటం మంచిది.

                     ఎంత ఉరుకులు, పరుగుల జీవితాన్ని గడుపుతున్నా ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అనారోగ్యం బారినపడకుండా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవాలి. శరీరానికి తగినంత విశ్రాంతి ఉండాలి. ఒత్తిడి లేని జీవితాన్ని గడపాలి. ఏదీ అతిగా చేయకూడదు. తినకూడదు. తాగకూడదు. మనలో చాలామంది ఆకలి వేసినప్పుడు కడుపు నింపుకోవటానికి ఏది అందుబాటులో ఉంటే అది తినేస్తుంటాం. చాలామంది ప్రాసెసింగ్‌ చేసిన ఆహారాన్ని, వేపుళ్లు (ఫ్రెంచ్‌ ఫ్రైస్‌, నూడుల్స్‌) వంటివి తినేస్తుంటారు. బయట దొరికే ఇలాంటి ఆహార పదార్థాల్లో ఎక్కువగా ఉప్పు, చక్కెర ఎక్కువగా వాడుతుంటారు. అందువల్ల వీటిని ఎక్కువగా తీసుకుంటే ఇబ్బందులు ఏర్పడతాయి. వీటికి బదులుగా తాజా పండ్లు, కూరగాయలు వంటి ప్రత్యామ్నాయంగా తీసుకుంటే ఆరోగ్యం మెరుగవుతుంది.

స్నాక్స్‌ కంటే పప్పులు మేలు : ప్రతిరోజూ సాయంత్రం పూట ఏదో ఒక పండును తినటం ఎంతైనా మంచిదే. ఆకలి తీరకపోతే చిప్స్‌, బిస్కెట్లు, కేకులు, మిర్చీ బజ్జీలు, ఉప్పు కలిపిన పదార్థాలు కొందరు తింటుంటారు. ఇలాంటి వాటికి బదులుగా బాదంపప్పు, పిస్తాపప్పు, జీడిపప్పు, వాల్‌నట్స్‌ లాంటివి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవే కాకుండా పెరుగుతో చేసిన పదార్థాలు, మజ్జిగ లాంటివి తీసుకుంటే శరీరానికి ప్రొటీన్లు, మంచి కొవ్వులు లభించి అదనపు శక్తిని ఇస్తాయి. యాపిల్‌ పండుతోపాటు వాల్‌నట్స్‌ వంటివి తీసుకుంటే ఆకలితోపాటు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

పండ్లతో అధిక పోషకలు : ప్రతిఒక్కరూ ఉదయమో, సాయంత్రమో ఏదో ఒక సమయంలో రోజులో ఒకటో రెండో పండ్లు తీసుకోవటం ఆరోగ్య పరంగా ఎంతో మేలు చేస్తుంది. అవి శరీరానికి శక్తిని అందిస్తాయి. మార్కెట్లో అనేక రకాల పండ్లు అందుబాటులో ఉంటున్నాయి. పండ్లలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. వీటితోపాటు విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు దండిగా లభిస్తాయి. మామిడి, బొప్పాయి, అరటి వంటి లేత పసుపు రంగు ఉండే పండ్లలో విటమిన్‌ ఎ ఎక్కువగా ఉంటుంది. దీని ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగు తుంది. బత్తాయి,నారింజ వంటి పండ్లతో మంచి ఆరోగ్యం మెరుగుదల అవుతుంది. ఇవి తీసుకుంటే జలుబు చేస్తుందనేది అపోహ మాత్రమే!

మొలకెత్తే గింజలతో అదనపు శక్తి : తాజా పండ్లతోపాటుగా మొలకెత్తిన గిరజలు తిన్నా శరీరానికి అదనపు శక్తి చేకూరుతుంది. శాకాహారం తినేవారిలో బీ12 లోపం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వారు ఉసిరి, క్యారెట్‌, ఖర్జూరం వంటి డ్రైఫ్రూట్స్‌ను తీసుకుంటే రకరకాల పోషకాలు శరీరానికి లభిస్తాయి. మొలకెత్తిన గింజలు తినలేని వారు బోధుమగడ్డి జ్యూస్‌ కూడా తీసుకోవచ్చు.

ఆహారం ఎలా తీసుకోవాలంటే…

శరీరానికి శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకోవటం మేలు. మోతాదుకు మించి తీసుకోకూడదు. అంటే సరిపడా కేలరీలు ఉన్న ఆహారాన్నే తీసుకోవాలి. ఎన్ని కేలరీలు అవసరమనేది తెలుసుకుని తీసుకోవటం మంచిది. ఎందుకంటే బరువు తక్కువగా ఉన్న వారు ఎక్కువ కేలరీలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఎక్కువ బరువు ఉన్న వారు తక్కువ కేలరీలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ప్రస్తుత జీవన విధానంలో సాధారణ బరువు ఉండే వారికి ప్రతిరోజు 1600 నుంచి 1800 కేలరీలు ఉండే ఆహారం అవసరం అవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అనునిత్యం తాజాపండ్లతోపాటు డ్రైఫ్రూట్స్‌, పెరుగు పదార్థాలను తీసుకుంటే శరీరానికి ఫైబర్‌, ప్రొటీన్లతోపాటు మంచి కేలరీలు అందుతాయని సూచిస్తున్నారు.

కేలరీలను అవసరాన్ని బట్టే తీసుకోవాలి …

శరీరంలో కేలరీల శాతం ఎక్కువగా ఉంటే వాటిని తగ్గించుకునేలా ఆహారాన్ని ఎంపిక చేసుకోవాలి. ఇలాంటి వారు పంచదార, స్వీట్లు, ఫ్రైఫుడ్‌, కూల్‌డ్రింకులు, కేకులు, ఐస్‌క్రీములు, పిజ్జాలు, బర్గర్లు, ఆల్కాహాల్‌ వంటివి తీసుకోకూడదు. చిన్న పిల్లలకు పాలిచ్చే తల్లులు, గర్భవతులకు పోషకాలు అధికంగా అవసరం. అందువల్ల వారి ఆహారంలో ఎక్కువ కేలరీలు ఉండేలా చూడాలి. వారు పాలు, పండ్లు, డ్రైఫ్రూట్స్‌ ఎక్కువగా తీసుకోవాలి. మధుమేహం ఉన్న వారికి సరిపడా కేలరీలు ఉన్న ఆహారమే ఇవ్వాలి. టీబీ ఉన్న వారు అత్యధిక కేలరీలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఎవ్వరికి వారు తాము చేసే పనిని బట్టి కూడా కేలరీల అవసరం మారుతూ ఉంటుంది. ఎక్కువగా పనిచేసే వారు ప్రతిరోజూ 2200 కేలరీల ఆహారాన్ని తీసుకోవచ్చు.

మితాహారమే మేలు : ప్రతిఒక్కరూ తమ శరీరానికి సరిపడా శక్తి కావాలంటే తినే భోజనంలో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు, నీరు సముపాళ్లలో ఉండేలా చూసు కోవాలి. అతిగా వద్దు. ఏదైనా సరిపడా తీసుకోవటం ఉత్తమం. రోజూ తినే అన్నం, చపాతీలను ఏదో ఒక పప్పుతో కలిపి తీసుకుంటే మంచిది. పిండి పదార్థాలకు ప్రొటీన్‌ను జతచేసినట్లే అవుతుంది. మాంసాహారంలో అధిక కేలరీలుశరీరానికి కావాల్సిన కేలరీలు మాంసాహారంలో అధిక మొత్తంలో ఉంటాయి. వీటిలో ఎక్కువగా ఉండే కొవ్వులు శరీరంలోకి చేరతాయి. ఇలా కొవ్వు శరీరంలోకి పేరుకు పోవటం అంత మంచిదికాదు. అందువల్ల వారానికి ఒకటి లేదా రెండుసార్లు తినాలి. శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు, ఎ,డి, ఇ విటమిన్లు, కొవ్వులు ఉండే కోడిగుడ్లను ఆహారంలో భాగంగా చేసుకోవటం మేలు. బ్రెడ్‌ కూడా అదనపు బలం కోసం తోడ్పడు తుంది. ఎప్పుడో జ్వరం వచ్చినప్పుడే కాకుండా ద్నీఇ్న రోజూ ఆహారంలో చేసుకోవటం కూడా మంచిదే. ప్రతి బ్రెడ్‌ స్లైస్‌లో 69 కేలరీలు ఉంటాయి.

➡️