పిల్లలకు ‘ఎబిసి’ జ్యూస్‌ ఇవ్వండి..

Jan 2,2024 10:14 #feature

చలికాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పిల్లలకు అనారోగ్యం చేస్తుంది. తరచూ ఆరోగ్యం పాడవ్వకుండా ఉండాలంటే, పోషకాలతో కూడిన ఆహారంతో పాటు ‘ఎబిసి’ జ్యూస్‌ ఇవ్వడం మంచిది. ఆపిల్‌, బీట్‌రూట్‌, క్యారెట్‌తో తయారుచేసే ఈ జ్యూస్‌ ‘ఎ’ నుండి ‘జెడ్‌’ వరకు అన్ని పోషకాల లోపాన్ని మాయం చేస్తుంది. ఈ జ్యూస్‌ తాగడం వలన పిల్లలకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే..

బలమైన రోగనిరోధక శక్తి : విటమిన్‌ సి, విటమిన్‌ కె పుష్కలంగా ఉండే ఈ జ్యూస్‌ని తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా.. ఈ రసంలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి.

జీర్ణక్రియ కోసం : యాపిల్‌, బీట్‌రూట్‌, క్యారెట్‌లలో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. ఈ ఫైబర్‌ జీర్ణక్రియకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే శరీరంలో తయారయ్యే టాక్సిన్స్‌ పేరుకుపోకుండా, సులభంగా కరిగిపోతాయి.

కంటి చూపు మెరుగుపడుతుంది : ఈ జ్యూస్‌లో విటమిన్‌ ఎ పుష్కలంగా ఉండడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. అంతేకాదు చర్మం నిగారింపుగా ఉంటుంది. చర్మాన్ని మాత్రమే కాకుండా మొత్తం శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది.

➡️