సెలవులు సరదాలు

May 27,2024 04:13 #feachers, #jeevana

వేసవి సెలవులు వచ్చాయి
సంతోషాలను తెచ్చాయి
చదువుకు విరామమిచ్చాయి
ఆటకు సమయమిచ్చాయి

సందడి గుండెను ఇల్లంతా
కేరింతలతో పిల్లలమంతా
ఎగురుతూ గెంతుతు మేమంతా
సెలవులన్నీ గడుపుతము

పల్లె పట్నం తిరుగుతము
బంధువుల ఇంటికి వెళతాము
జాతరలన్నీ చుట్టేస్తాం
తినుబండారాలు తినేస్తాం

అమ్మకు సాయం చేస్తాము
పనులెన్నో నేర్చుకుంటాము
కమ్మటి వంటలు చేస్తాము
అంతా కలిసే తింటాము

– యాడవరం చంద్రకాంత్‌ గౌడ్‌,
సిద్దిపేట.

➡️