పిల్లలు త్వరగా నిద్రపోవాలంటే …

పిల్లలు త్వరగా నిద్రపోకుండా మారం చేస్తుంటే తల్లిదండ్రులు ఇబ్బంది పడతారు. అందువల్ల వారు సరిగ్గా నిద్ర పోవాలంటే సరైన వాతావరణం కూడా ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. పిల్లలు త్వరగా నిద్రపోవాలంటే ఒకే సమయంలో అందరూ నిద్రపోవటం అలవాటు చేసుకోవాలి. రాత్రి భోజనాన్ని త్వరగా తినేలా చూడాలి. రాత్రి సమయంలో పిల్లలకు హెవీ డిన్నర్‌ చేయకూడదు. పడుకునేముందు పిల్లలకు గోరువెచ్చని నీటితో స్నానం చేయించటం వల్ల కూడా త్వరగా నిద్రపోతారు. నిద్రపోయేటప్పుడు గది పూర్తిగా చీకటిగా ఉండకుండా నైట్‌లైట్లు వినియోగించాలి.
పిల్లలకు పెరుగన్నం, అరటిపండును తినిపిస్తే వారు త్వరగా పడుకునే వీలుంటుంది. ఎక్కువ సేపు ఆటపాటల్లో పాల్గొనేలా చూడటం వల్ల వారి శరీరం అలిసిపోయి త్వరగా నిద్రపోవటానికి ఆస్కారం ఉంటుంది.
ఏ వయస్సు వారిలోనైనా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడటంలో నిద్ర ముఖ్య పాత్ర పోషిస్తుంది. చిన్నారులు, యుక్త వయస్సున్న వారిలో మానసిక పెరుగుదల, వికాసం రెండూ నిద్రతోనే ముడిపడి ఉంటాయి. అందువల్ల పిల్లలు తగినంత సేపు నిద్రపోయేలా చూడాలి.

➡️