జాతి పతాక

Jan 25,2024 07:34 #jeevana

ఎగిరింది ఎగిరింది మన జాతి పతాక ఎగిరింది

వంగింది వంగింది ఆ నింగే సలాం చేసింది

భరతావనే స్వేఛ్చా వాయువులనే పీల్చిందీ

ఆబాలగోపాలమంతా పులకించి ఆడింది

అమర వీరుల త్యాగం కాషాయమై వెలసింది

శాంతి కపోతం శ్వేత వర్ణమై నడుమ నిలిచింది

అశోకుని ధర్మ చక్రం అజేయంగా అమరింది

సర్వజన సంక్షేమం సతత హరితమై పూసింది

సర్వమత సామరస్యమై అందరి మది గెలిచింది

సకల జనుల నొకే తాటిపై ఉద్యమమై నడిపింది

వందేమాతర నినాదమై తెల్లదొరల తరిమింది

పింగళి చేతి పతాకంతో ఎర్రకోట మెరిసింది

– గుండాల నరేంద్ర బాబు, 94932 35992.

➡️