ముద్దులొలుకు పువ్వు

Jan 29,2024 09:32 #jeevana

ముద్దబంతి ముద్దబంతి

మురిపించే ముద్ద బంతి

పసిడి వర్ణాల బంతి

బంగారు కాంతుల బంతి

 

ముద్దబంతి ముద్దబంతి

ముంగిట విరిసే పూబంతి

మురిపాల మాపెరటి బంతి

ముచ్చటైన మా ఇంటి కాంతి

 

ముద్దబంతి ముద్దబంతి

పొద్దుటేల ఇంటి ఇంతి

మాపటేల మంగళహారతి

మధ్య వేళ మధ్యమావతి

 

ముద్ద బంతి ముద్దబంతి

ముద్దులొలుకు చేమంతి

మరులుగొలుపు పూబంతి

మనోహరమే ప్రతి ఇంతి

 

కనువిందుల ముద్దబంతి

కమనీయము ముద్దబంతి

కనకాభిషేక భారతి

కళల కర్పూర హారతి

       – గుండాల నరేంద్ర బాబు,94932 35992.

➡️