స్వచ్ఛ మనసు మాది

May 23,2024 04:30 #jeevana

స్వచ్ఛ మనసు మాది
కుళ్ళు కుతంత్రాలు మాలో లేవు
పగలు ప్రతీకారాలు అసలే లేవు
మోసాలు చాడీలు తెలియవు
కుల మత బేధాలు మాలో ఉండవు
దుర్మార్గాలు తొలగిస్తాం
సన్మార్గంలో పయనిస్తాం
మంచి మాటలు వింటాం
చెడుకు దూరంగా ఉంటాం
సమతా మమతా కలిగి ఉంటాం
సహకారం పెంచుకుంటాం
సౌభ్రాతృత్వంతో ముందుకు సాగుతాం
సమానత్వమే మేము కోరుకుంటాం
దురాభిప్రాయాలు చేరిపేస్తాం
పారదర్శకత మా లక్ష్యం
అందరి పట్ల స్వచ్ఛ మనసే మేము చూపిస్తాం

– కనుమ ఎల్లారెడ్డి,
అమెరికా, 93915 23027.

➡️