అంగన్వాడీలపై దాష్టీకం – మీడియా ప్రతినిధులపై దౌర్జన్యం

Jan 22,2024 08:54 #Anganwadi strike

విజయవాడ : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ … నిరవధిక నిరాహార దీక్షలు కొనసాగిస్తోన్న అంగన్వాడీలు నేడు ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో … పోలీసులు అంగన్వాడీలపై దాష్టీకం ప్రదర్శించారు. విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద అంగన్వాడీలను అరెస్టు చేయడానికి నిన్న అర్థరాత్రి 1.30 గంటల సమయంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అక్కడకు చేరుకున్నాయి. దాదాపు 15 వరకు వాహనాలు వచ్చాయి. 3 గంటల సమయంలో లైట్లను ఆర్పివేసి అంగన్వాడీల పై పోలీసులు కర్కశత్వంగా ప్రవర్తించారు. దౌర్జన్యంగా అరెస్టులు చేశారు. వాహనాల్లోకి ఆందోళనకారులను ఈడ్చి పడేశారు. పోలీసుల దౌర్జన్యాన్ని ఫొటోలు తీయడానికి ప్రయత్నించిన ప్రజాశక్తి ఫొటోగ్రాఫర్‌ రామును అడ్డుకుని అరెస్టు చేశారు. ప్రజాశక్తి విలేకరి రాజుపై దౌర్జన్యం చేశారు. వార్తలు కవరేజీ చేయకుండా పక్కన పెట్టాలంటూ… ధర్నా చౌక వద్ద పోలీసులు రణరంగం సృష్టించారు. ప్రజాశక్తి ఫొటోగ్రాఫర్‌ రమణపై దౌర్జన్యం ప్రదర్శించారు. ఫొటోలు తీయడానికి వీల్లేదని డిసిసి విశాల్‌ గున్ని బెదిరించారు. మీడియా అయితే ఏంటంటా ? అంటూ పోలీసులు విలేకరులను పక్కకు నెట్టేశారు. అర్ధరాత్రి అంగన్వాడీల అరెస్ట్ల్ను

విజయవాడ చరిత్రలో మీడియా పై దౌర్జన్యం

అంగన్వాడీలపై పోలీసుల దౌర్జన్యాన్ని ఫొటోలు తీస్తున్న మీడియా ప్రతినిధులపై డిసిసి గున్ని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఫోటోలు తీస్తే ఊరుకోనని, పేపర్‌లో ఈ వార్త రాకూడదని బెదిరించారు. కింది స్థాయి పోలీసులు మీడియా ప్రతినిధులపై తీవ్రంగా రెచ్చిపోయారు. బలవంతంగా అంగన్వాడీలను బస్సులో ఎక్కించారు. సుమారు 20 మందికి పైగా బస్సులను తీసుకొచ్చి కర్కశత్వంగా బలవంతపు అరెస్టులు చేశారు. దీంతో ధర్నా చౌక వద్ద ఉద్రిక్తత నెలకొంది.

➡️