కుప్పం చేరని కృష్ణా జలాలు !

Feb 28,2024 12:01 #issue, #Krishna waters, #reached

ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో : ‘హంద్రీనీవా’ కృష్ణా జలాలు కుప్పంకు పూర్తి స్థాయిలో చేరుకోకపోవడంతో ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కుప్పం నియోజకవర్గం పరిధిలోని రామకుప్పం మండలం రాజుపేట వద్ద కృష్ణా జలాలకు హారతి ఇచ్చి సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నీటిని కుప్పం ప్రాంతం వైపు వదిలారు. ఈ కాలువ నీరు మంగళవారానికే శాంతిపురం సమీపంలో ఇంకిపోయింది. దీంతో, ప్రజల ఆశలు ఒక్క రోజులోనే ఆవిరయ్యాయి. దీంతో, హంద్రీనీవా కాలువలో జగనన్న నీలెక్కడ అంటూ రామకుప్పం మండలానికి చెందిన టిడిపి నేతలు ఆందోళనకు దిగారు. దీనిపై ఇరిగేషన్‌ శాఖాధికారులను సంప్రదించేందుకు ప్రయత్నించగా వారి ఫోన్లు స్విచ్‌ ఆఫ్‌ అని వచ్చాయి. గతంలో ఇచ్చిన మాట ప్రకారం రూ.560 కోట్ల ఖర్చుతో 672 కిలోమీటర్ల దూరం నుంచి కృష్ణా నది జలాలను కుప్పంకు విడుదల చేసినట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ కాలువ నీటిని 110 మైనర్‌ ఇరిగేషన్‌ చెరువుల ద్వారా 6,300 ఎకరాల అందిస్తామని చెప్పారు. అయితే, ఈ కాలువలో పూర్తి స్థాయిలో కృష్ణా జలాల రాలేదని, ఎన్నికల లబ్ధి కోసం ఆగమేఘాలపై దీనిని ప్రారంభించారని ఈ ప్రాంత ప్రజలు విమర్శిస్తున్నారు. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు 1983 అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు చేశారు.మోసగించిన ముఖ్యమంత్రి : సిపిఎంకుప్పం నియోజకవర్గానికి హంద్రీ-నీవా నీళ్లు తీసుకొచ్చామంటూ ఆర్భాటంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి ప్రజలను మోసగించారని సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు విమర్శించారు. అసంపూర్తిగా ఉన్న కాలువను పూర్తి చేయకుండా వచ్చే ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం నీటిని స్టోరేజ్‌ చేసి తాత్కాలిక గేట్లు పెట్టి కుప్పం నియోజకవర్గానికి వదిలామని చెప్పడం మోసం తగదన్నారు.

➡️