sexual harassment: ప్రజ్వల్‌ రేవణ్ణపై లుక్‌ అవుట్‌ నోటీసులు

బెంగళూరు :    లైంగిక వేధింపుల కేసులో జెడిఎస్‌ ఎంపి ప్రజ్వల్‌ రేవణ్ణపై గురువారం లుక్‌అవుట్‌ నోటీసులు జారీ అయ్యాయి. రేవణ్ణ తక్షణమే ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఎదుట హాజరుకావాలని, లేకుంటే సిట్‌ ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉంటుందని కర్ణాటక హోంమంత్రి జి.పరమేశ్వర తెలిపారు. విచారణకు హాజరయ్యేందుకు ఏడురోజుల సమయం ఇవ్వాలన్న రేవణ్ణ అభ్యర్థనను సిట్‌ తిరస్కరించింది.   హెచ్‌డి రేవణ్ణ, ఆయన కుమారుడు ప్రజ్వల్‌ రేవణ్ణలు విచారణకు హాజరుకావాల్సిందేనని, లేకుంటే అరెస్ట్‌ తప్పదని మంత్రి హెచ్చరించారు.

ఈ వీడియోలపై ప్రధాని మోడీ ఎందుకు మౌనం వహించారని కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ ధ్వజమెత్తారు. ” పది రోజుల క్రితం వరకు ఎన్నికల ప్రచారంలో రేవణ్ణ ప్రధాని మోడీతో కలిసి తిరిగాడు. భుజంపై చేయివేసి, ఫోటోలకు ఫోజులిచ్చారు. పొగడ్తలతో ముంచెత్తారు. ఇప్పుడు అదే నేత దేశం నుండి పరారయ్యాడు. అతని క్రూరమైన నేరాలను వింటేనే నా గుండె వణికిపోతుంది. వందలాది మంది మహిళల జీవితాలను నాశనం చేశాడు. అతనిపై మోడీజీ మీరు మౌనంగా ఉంటారా ” అని ప్రశ్నించారు.

➡️