ఇరాక్‌లో దారుణం – సోషల్‌ మీడియా స్టార్‌ దారుణహత్య

Apr 28,2024 15:39

ఇరాక్‌ : ఇరాక్‌లో దారుణం జరిగింది. బాగ్దాద్‌లోని సోషల్‌ మీడియా స్టార్‌ హత్యకు గురయ్యారు. టిక్‌టాక్‌లో ఉమ్‌ ఫహాద్‌గా ప్రజాదరణ పొందిన ఆమెకు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. తూర్పు బాగ్దాద్‌లోని జయౌనా ప్రాంతంలోని ఆమె ఇంటి వద్ద బైక్‌మీద వచ్చిన ఓ దుండగుడు కాల్పులు జరిపి అక్కడ నుంచి పరారయ్యాడు. ఇందుకు సంబంధించిన చిత్రాలు సీసీటీవీల్లో రికార్డయ్యాయి. అయితే, నిందితుడు ఎవరనే విషయం మాత్రం తెలియరాలేదు. గతంలో సఫాదీ చేసిన వీడియోలు వివాదాస్పదమయ్యాయి. నైతికత ఉల్లంఘన కింద ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష పడింది. బయటకు వచ్చిన అనంతరం.. పాప్‌ మ్యుజిక్‌కు డ్యాన్స్‌లు చేస్తూ వీడియోలు తీయడం ప్రారంభించారు.

➡️