సూర్యకుమార్‌ యాదవ్‌ సెంచరీ

  • సన్‌రైజర్స్‌ ఏడు వికెట్ల తేడాతో ముంబయి ఘన విజయం

ముంబయి: మిస్టర్‌ 360డిగ్రీస్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ సెంచరీతో కదం తొక్కి ముంబయి జట్టును ఒంటిచేత్తో గెలిచిపించాడు. వాంఖడే వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ముంబయి జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 173పరుగులు చేయగా.. ఛేదనలో ముంబయి జట్టు 17.2ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి 174పరుగులు చేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌(102నాటౌట్‌; 51బంతుల్లో 12ఫోర్లు, 6సిక్సర్లు) మ్యాచ్‌ను ముగించాడు. ఛేదనలో భాగంగా ముంబయి జట్టు టాపార్డర్‌ బ్యాటర్లు ఇషాన్‌ కిషన్‌(9), రోహిత్‌ శర్మ(4), నమన్‌ ధీర్‌(0) సింగిల్‌ డిజిట్‌కే పెవీలియన్‌కు చేరారు. దీంతో ముంబయి జట్టు 31పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో సూర్యకుమార్‌ సెంచరీకి తోడు తిలక్‌ వర్మ(37నాటౌట్‌) మరో వికెట్‌ పడకుండా మ్యాచ్‌ను ముగించారు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ సూర్యకుమార్‌ యాదవ్‌కు లభించింది. టాస్‌ గెలిచిన హార్దిక్‌ పాండ్యా హైదరాబాద్‌కు బ్యాటింగ్‌ ఇవ్వగానే ఫ్యాన్స్‌ ఎగిరి గంతేశారు. ఐపీఎల్‌ రికార్డులు బద్ధలవ్వడం ఖాయమనుకున్నారంతా. కానీ, అభిమానులు అనుకున్నదొకటి అయిందొకటి. పవర్‌ ప్లేలో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ(11)ను బుమ్రా ఔట్‌ చేయగా.. మర్క్‌రమ్‌ స్థానంలో వచ్చిన మయాంక్‌ అగర్వాల్‌(5)ను కంబోజీ బౌల్డ్‌ చేశాడు. అక్కడితో హైదరాబాద్‌ స్కోర్‌ వేగం తగ్గింది. ఆ తర్వాత ట్రావిస్‌ హెడ్‌(48), నితీశ్‌ కుమార్‌(20)లు ధాటిగా ఆడే ప్రయత్నం చేశారు. కానీ పాండ్యా ఈ జోడీని విడదీసి స్కోర్‌బోర్డుకు బ్రేక్‌లు వేశాడు. కాసేపటికే పీయుష్‌ చావ్లా డేంజరస్‌ హెడ్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌(2)లనున బోల్తా కొట్టించడంతో వంద లోపే ఐదు కీలక వికెట్లు కోల్పోయింది. షV్‌ాబాజ్‌ అహ్మద్‌(10), మార్కో జాన్‌సెన్‌(17)లు జట్టు స్కోర్‌ వంద దాటించారు. అయితే.. పాండ్యా ఒకే ఓవర్లో ఈ ఇద్దరిని వెనక్కి పంపి.. ఆరెంజ్‌ ఆర్మీ భారీ స్కోర్‌ ఆశలపై నీళ్లు చల్లాడు. కానీ, కెప్టెన్‌ కమిన్స్‌(35 నాటౌట్‌), ఇంప్యాక్ట్‌ ప్లేయర్‌ సన్వీర్‌ సింగ్‌(8 నాటౌట్‌)లు పట్టుదలగా పోరాడి 9వ వికెట్‌కు రన్స్‌ జోడించారు. తుషార వేసిన 20వ ఓవర్లో కమిన్స్‌ సిక్సర్‌, ఫోర్‌ బాదాడు. దీంతో హైదరాబాద్‌ 8 వికెట్ల నష్టానికి 173 రన్స్‌ చేయలగలిగింది. ముంబై బౌలర్లలో హార్దిక్‌ పాండ్యా(3/31) పీయూష్‌ చావ్లా(3/33)లు రాణించారు.

స్కోర్‌బోర్డు…
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: హెడ్‌ (సి)తిలక్‌ వర్మ (బి)చావ్లా 48, అభిషేక్‌ శర్మ (సి)ఇషాన్‌ కిషన్‌ (బి)బుమ్రా 11, మయాంక్‌ అగర్వాల్‌ (బి)అన్షుల్‌ కంబోల్‌ 5, నితీశ్‌ రెడ్డి (సి)కంబోల్‌ (బి)హార్దిక్‌ పాండ్యా 20, క్లాసెన్‌ (బి)చావ్లా 2, జెన్సన్‌ (బి)హార్దిక్‌ పాండ్యా 17, షాబాజ్‌ అహ్మద్‌ (సి)సూర్యకుమార్‌ (బి)హార్దిక్‌ పాండ్యా 10, అబ్దుల్‌ సమద్‌ (ఎల్‌బి)చావ్లా 3, కమిన్స్‌ (నాటౌట్‌) 35, సన్వీర్‌ సింగ్‌ (నాటౌట్‌) 8, అదనం 14. (20 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి) 173పరుగులు. వికెట్ల పతనం: 1/56, 2/68, 3/90, 4/92, 5/98, 6/120, 7/124, 8/136
బౌలింగ్‌: తుషారా 4-0-42-0, కంబోల్‌ 4-0-42-1, బుమ్రా 4-0-23-1, హార్దిక్‌ పాండ్యా 4-0-31-3, చావ్లా 4-0-33-3.
ముంబయి ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: ఇషాన్‌ కిషన్‌ (సి)మయాంక్‌ అగర్వాల్‌ (బి)జెన్సన్‌ 9, రోహిత్‌ శర్కమ (సి)క్లాసెన్‌ (బి)కమిన్స్‌ 4, నమన్‌ ధీర్‌ (సి)జెన్సన్‌ (బి)భువనేశ్వర్‌ కుమార్‌ 0, సూర్యకుమార్‌ యాదవ్‌ (నాటౌట్‌) 102, తిలక్‌ వర్మ (నాటౌట్‌) 37, అదనం 22. (17.2 ఓవర్లలో 3వికెట్ల నష్టానికి) 174పరుగులు.
వికెట్ల పతనం: 1/26, 2/31, 3/31
బౌలింగ్‌: భువనేశ్వర్‌ కుమార్‌ 4-1-22-1, జెన్సన్‌ 3-0-45-1, కమిన్స్‌ 4-1-35-1, నటరాజన్‌ 3.2-0-31-0, నితీశ్‌ రెడ్డి 2-0-16-0, షాబాజ్‌ అహ్మద్‌ 1-0-11-0

➡️