అప్డేట్‌

Jan 1,2024 10:20 #sahityam

ఆచరణ లేని స్టేటసులు

అది చూసి అయోమయంలో అమాయకులు

మస్తిష్కంలో యురేకా తడబడినట్టుగా

సెల్ఫీ కుడి ఎడమై కనిపిస్తున్నా

అదే నమ్మే ఫాలోవర్‌

 

అనుకరణల ఆలోచనలు ఒకవైపు

మూలం తెలియక వథా అయ్యే కామన్‌ మెన్‌ టైం

ముఖ పుస్తకంలో నిత్యం సూక్తుల చక్కర్లు

అనాథాశ్రయాల్లో సీనియర్‌ సిటిజన్లు

మది దోచే ఆర్టిఫిషియల్‌ అందాలు

కన్ఫ్యూజన్లో అదే నిజమనుకొని యూత్‌ పడిపోయే

 

కొత్త అంటూ అసలువన్నీ పక్కకు

అనవసర చెత్తను తెచ్చుకునే కాన్ఫిడెన్స్‌తో

 

దొంగ నవ్వులు నమ్మబలికే కస్టమర్లకు

టార్గెట్‌ నింపడానికి తన్లాటతో

నయా దుకాణాల సేల్స్‌మెన్‌ కాల్స్‌

 

లోకల్‌ అయిపోయే రోజు అబ్రాడ్‌ ఫోన్‌ కాల్స్‌

లైవ్‌ చాటింగ్‌, కాలింగ్‌తో అనవసర పనులు తెప్పలుగా

బంధాలు,అనుబంధాలు ఎక్కెను అటక్కు

రియాలిటీ లేని ‘రిలేషన్‌ షిప్పులు’

మరెన్నో కావాలి అప్డేట్‌

 

కోటి కాంతులతో ఈ కొత్త సంవత్సరం

సరికొత్తగా ఇంద్రధనస్సులా …

– డా. చిటికెన కిరణ్‌ కుమార్‌94908 41284

➡️