పచ్చని పొద్దు పొడుపు

Feb 26,2024 09:52 #sahityam

మనమంతా నింపాదిగా

కవిత్వం రాసుకుంటున్న సమయాన

వాళ్ళు అన్నం మూట భుజానికెత్తుకుని

ప్రపంచంలోనే బలమైన

సైన్యంతో పోరాటానికి సిద్ధపడి వచ్చారు

 

మనమంతా నింపాదిగా

పెదాలు కదుపుతున్న సమయాన

వాళ్ళు తమకు ఉన్నదాంతో

బయల్దేరి రుతువులకెదురు

నిలిచి పోరాటానికి

సిద్ధపడి వచ్చారు!

 

మనమంతా నింపాదిగా

నడుచుకుంటూ అడుగులు

లెక్కలేస్తున్న సమయాన

వాళ్ళు లక్షలాదిగా

ఈ దేశ మనువుకు ఎదురు తిరిగి

రాజధానిని చుట్టుముట్టారు

 

వాడు దారి పొడుగునా

ముళ్ళ కంచెలు పాతి

కాంక్రీట్‌ దిమ్మలతో అడ్డుకో జూస్తే

నాగళ్ళు భుజానేసుకుని

మరోసారి ఎదురు నిలిచారు

 

ఈ దేశ నుదుటిపై వాళ్ళు

పచ్చని పొద్దు పొడుపులు

 

నువ్వింక వారి వరి పొలానికి

కాపలాదారుగా

పరుగున వస్తావా?

– కెక్యూబ్‌ వర్మ94934 36277

➡️