మా రామాలయం

Jan 26,2024 08:17 #sahityam

మా ఊళ్ళో ఉందో రామాలయం

పేద, సామాన్యుల ఆలయం

పూరి గుడిసెల మధ్యే ఆవాసం

వారి కష్టార్జితంతోనే నిర్మాణం

రోజూ హారతీ వాళ్ళకే

నవమి నాడు కళ్యాణం

ఊరంతా అక్కడే

ఆ చావటే ఊరు రచ్చబండ

చర్చలన్నీ ఆ సమక్షంలోనే

ఆ రాముడు సామాన్యుల వాడు,

నేడు నరేంద్రుడు

రాముడ్ని చేశాడు సంపన్నుల వాడిగా

భక్తులందరూ శత కోటీశ్వరులే

సామాన్యులకు చోటే లేదు

రియల్‌ ఎస్టేట్‌ ఊపు

ఆకాశ హర్మ్యాలు

స్టార్‌ హోటళ్లు

సర్వం వ్యాపారం

అంతా రాజకీయం

గెలుపుకు బ్రహ్మాస్త్రం

భక్తి రాముడిపై కాదు కుర్చీపై

ఏమైనా సందేహమా !

– ఎ. అజ శర్మ

➡️