మా ఇంటి తోరణాలు

Jan 22,2024 10:21 #sahityam

తల్లిగర్భం దాల్చిన నుంచి

వారి సంరక్షణకై

నీడలా వుంటారు

వారు ఆకలితో పస్తులున్నా

ఇంటింటి గుమ్మం ముందు

వారు చూపులు

పసి పిల్లల నవ్వులకై

ఎదురు చూస్తుంటాయి

ఊరు జనం పిల్లల్ని

తల్లుల్లా అంగన్వాడీలో

సాకుతారు

ప్రతి బిడ్డా

పౌష్టికాహారం, ఎదుగుదలకు

ఇంటింటా కాకిలా కబురు

మోసుకెళ్తారు

 

టీకాలు దగ్గర నుంచి

ఓటరు జాబితాల దాకా

వీరు తొక్కని గుమ్మంలేదు

వీరు సంతకం

ఇంటికి మామిడి

తోరణాలవుతాయి

నిత్యం పసిబిడ్డల సంరక్షణకై

తలపై ముళ్ళకీరిటం మోస్తూ..

క్రీస్తుకు దిగబడిన డొక్కలో

బల్లెంలా

ప్రభుత్వాలతో యుద్ధం

చేస్తున్నారు.

 

వీరు నేడు

హక్కుల పత్రాల సంతకం

కోసం

పునర్థానమవటానికి

సిద్ధపడుతున్నారు.

అణచివేతలకు కలలు కూలవు

శ్రమశక్తిని చిన్నచూపు చూస్తే

ఆకలి మంటల లావాగ్ని

పాలకులను

దహించకమానదు.

అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళ

కన్నీటి యుద్ధంలో

మీ ఉక్కు చట్టాలు

ద్వంసమవ్వక తప్పదు

ఆకలికి అన్యాయం చేస్తే

కూలితల్లుల కడుపు కొడితే

పాలకులు మట్టిగొట్టుకు

పోవడం ఖాయం

శ్రమజీవులదే చరిత్ర

భయమెరుగని ఉద్యమాలదే

విజయం !        – తంగిరాల సోని 96766 09234

➡️