స్పర్శ

Feb 26,2024 09:46 #sahityam

రాత్రి .. మగతలోంచి

మెల్లగా మేలుకుంటోంది

కిటికీకి చుట్టుకున్న

లేతపూల వాసన

చిరునవ్వుతో పలకరించింది

 

ఆకాశాన్ని అందుకోవాలని

పైపైకి ఎగిరిన పక్షి ఒకటి

అలసిపోయి

చెట్టు గుబురులో దాగి

సేదదీరుతోంది!

 

కూలిన శిథిలాల కింద

కనుపాపలని వెలికితీసి

కలలు కనేందుకై

కొద్దికొద్దిగా తొలగుతున్న శూన్యం

ఆశల వసంతానికి

వేదికను సిద్ధపరుస్తోంది

 

ప్రేమించడం నేర్పిన నిన్నటి స్పర్శ

బతుకును ప్రేమించడం నేర్పుతోంది

ముక్కలైన హృదయాన్ని

ఒడిలోకి చేర్చుకొని

ఓదార్పుగా కలిపి కుడుతుంది !

– సునీత గంగవరపు94940 84576

➡️