ఆరాధన – ఆచరణ

Feb 19,2024 10:36 #sahityam

దర్శం ఎదురైన ప్రతిసారీ

అరమోడ్పు కన్నులతో

ముకుళిత హస్తాలతో

స్వాగతిస్తాం

బిరుదులు తగిలిస్తాం

భజనలు సాగిస్తాం

దాని దర్శన భాగ్యం కలిగిస్తూ

వీధికో విగ్రహం పెడతాం

దాని చుట్టూ ఆలయం కడతాం

హారతులిస్తాం

స్తుతిస్తాం..

భజిస్తాం.. పరవశిస్తాం!

 

అది నోరు తెరిచిందా,

తన గోడు వినమందా,

కీడు శంకిస్తాం

ఇక పరుగులంకిస్తాం.

మేమంతా

ఆదర్శానికి వారసులమే

కానీ అనుసరించడానికి నీరసమే !

– డా.డి.వి.జి. శంకరరావు, మాజీ ఎంపీ.94408 36931.

➡️