పేలిన జపాన్‌ ‘ప్రైవేట్ రాకెట్‌’

Mar 13,2024 11:41 #Japan, #Private rocket launch

జపాన్ : ప్రైవేట్ సెక్టార్ సహాయంతో జపాన్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టిన మొదటి రాకెట్‌గా పేలిపోయింది. కైరోస్ గా నామకరణం చేసిన ఆ రాకెట్ జపాన్‌లోని వాకయామా ప్రిఫెక్చర్ నుండి పైకి వెళ్లిన కొన్ని సెకన్లలో పేలిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పొగలు కమ్మేయగా, కొన్ని చోట్ల మంటలు ఎగిసిపడ్డాయి. దీనికి సంబంధించిన ప్రత్యక్ష ప్రసార వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది. వాకయామాలోని కుషిమోటో నగరంలోని అగ్నిమాపక విభాగం తెలిపిన వివరాల ప్రకారం, ఎవరూ గాయపడినట్లు ఎటువంటి నివేదికలు లేవని, మంటలు అదుపులోకి వచ్చాయని మీడియాలో పేర్కొన్నారు. రాకెట్ ప్రయోగం నిర్వహించిన టోక్యోకు చెందిన స్టార్టప్ స్పేస్ సంస్థ ఈ ఘటనపై స్పందించలేదు.

కెనాన్ ఎలక్ట్రానిక్స్, ఐహెచ్.ఐ, షింజు లతో పాటు ప్రధాన బ్యాంకులు, జపనీస్ కంపెనీల పెట్టుబడులతో 2018లో టోక్యో ఆధారిత స్పేస్ వన్ స్థాపించబడింది.

➡️