అమితమైన ప్రేమ అమ్మ…

Dec 10,2023 10:51 #Sneha

అంతులేని అనురాగం అమ్మ

అలుపెరుగని ఓర్పు అమ్మ

అద్భుతమైన స్నేహం అమ్మ

అపురూపమైన కావ్యం అమ్మ

అరుదైన రూపం అమ్మ

కల్మషం లేని ప్రేమ అమ్మ

అమృతంకన్నా తియ్యనైనా పలుకు అమ్మ…

నా గుండె పలికే ప్రతి మాట అమ్మా…!

నువ్వులేని జననం లేదు

నువ్వులేని మరణం లేదు

అమ్మ నీకు వరం

పెదవులు కలిసిన పదము అమ్మ..

ప్రేమను మలచిన పద్యము అమ్మ

ప్రేమకు మారుపేరు అమ్మ

త్యాగానికి చిహ్నం అమ్మ

డి. పావని, 9వ తరగతి, జెడ్పిహెచ్‌ఎస్‌, కొండపాక, సిద్దిపేట.

➡️