విద్యాలయమే ఒక దేవాలయం

Jun 23,2024 12:58 #Sneha

విద్యాలయం అనగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది గురువులు. ఎలాంటి వివక్ష లేకుండా తల్లిదండ్రుల వలె చూసుకుంటూ, మనకు జ్ఞానాన్ని ఇచ్చేవారు ఉపాధ్యాయులు. గురువు లేని విద్య గుడ్డివిద్య అంటారు. మన జీవితాలను ఒక చక్కని మార్గంలో నడిపించేది గురువులే. అలాంటి గురువులున్న విద్యాలయం ఒక దేవాలయంతో సమానం. మంచి ప్రవర్తన, క్రమశిక్షణ, నడవడిక అలవర్చుకోవాలంటే ప్రతిరోజు తప్పక బడికి వెళ్లాలి.
తెలియని ఎన్నో కొత్త సంగతులను తెలుసుకుంటాం. జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. తోటి విద్యార్థులతో కలిసి ఆడుకోవడం ద్వారా శారీరక ఆరోగ్యం కలుగుతుంది. మనలోని ప్రతిభను గుర్తించి భవిష్యత్‌లో ఏ రంగంలో స్థిరపడాలో ఆవిధంగా సిద్ధంచేసేది విద్యాలయమే. కాబట్టి విద్యార్థులంతా విద్యాలయానికి తప్పక రావాలి. సమాజంలో ఉన్న దురలవాట్లకు, దురాచారాలకు, మూఢనమ్మకాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి. విద్యాలయాన్ని ఒక పవిత్ర దేవాలయంగా భావించాలి.

గొల్లపల్లి సమీర, 10వ తరగతి, తెలంగాణ ఆదర్శ పాఠశాల,
బచ్చన్నపేట మండలం, జనగామ జిల్లా.

➡️