వదిలిన బద్దకం

Jun 16,2024 11:48 #chirumuvallu, #Sneha

ఒక ఊరిలో రామన్న అనే వ్యక్తి ఉండేవాడు. అతడు వట్టి బద్దకస్తుడు. ఏ పనీ చేసేవాడు కాదు. అతడి ఇంటి వెనుక వున్న మామిచెట్టు ప్రతిరోజూ తియ్యని పండ్లు ఇచ్చేది. ఆ పండ్ల్లనే అతడు మూడు పూటలాతిని బతికేసేవాడు.
ఒకరోజు రామన్న ఇంటికి రాజు అనే బంధువు వచ్చాడు. రాజుకు కూడా మూడు పూటలా మామిడి పండ్లనే భోజనంగాను, ఫలహారంగాను పెట్టేద్దామని రామన్న ప్లాన్‌ చేసుకున్నాడు. ఈ ప్లాన్‌ అర్థమైన రాజు ఆరోజు రాత్రి రామన్న నిద్రపోయాక అతడి ఇంటివెనుక ఉన్న మామిడిచెట్టును నరికి తీసుకువెళ్లిపోయాడు. ఉదయం లేచిన రామన్న ఇంటి వెనక్కు వెళ్లి చూసుకునే సరికి మామిడి చెట్టు లేదు. దీంతో అతడు ఎంతో ఏడ్చాడు. తినడానికి ఏ ఆధారమూ లేకపోవడంతో రామన్న ఆ రోజు నుంచి వ్యవసాయం, ఇతర పనులు చేయడం ప్రారంభించాడు. కొంత కాలం తర్వాత స్నేహితుడు రాజు మళ్లీ రామన్న ఇంటికి వచ్చాడు. బద్దకం వదిలేసి చక్కగా పనిచేసుకుంటూ తనను తాను పోషించుకుంటున్న రామన్నను చూసి ఎంతో సంతోషించాడు. తన బద్దకాన్ని పోగొట్టి జీవితాన్ని మెరుగుపరచిన రాజుకు రామన్న కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.

అరికేరి షరన్విత,
2వ తరగతి, నలంద విద్యా నికేతన్‌, విజయవాడ.

➡️