ఇల్లే ..అదిరే……!

May 6,2024 14:46 #house
  • జీవకళ.. ఉట్టిపడేలా..!
    ఇప్పుడు ట్రెండ్‌ మారింది. పాత, కొత్త దనంతో ఇంటీరియర్‌ డెకరేషన్తో వారి అభిరుచికి తగ్గట్టుగా పల్లెల్లో నిర్మాణాలు చేపడుతున్నారు.పక్షులు, జంతువులు, మొక్కల బమ్మలతో జీవకళ ఉట్టిపడేలా, ఆకట్టుకునేలా కళాకారులు ఇండ్లకు సొబగులు, ఇంపైన ఇంటీరియర్‌ గది అందాన్ని రెట్టింపు చేస్తుంది. ఇంటికి కొత్త శోభనిస్తుంది. అందుకే గాజు బమ్మలు, చెక్క విగ్రహాలు, రాతి ప్రతిమలతో కూడా గదులను అందంగా అలంకరించుకునేందుకు ఆసక్తి చూపారు.నేరుగా గోడలపై పెయింటింగ్స్‌కు ప్రాముఖ్యత ఇస్తుంటే..అభిరుచికి అనుగుణంగా ఇల్లును నిర్మించుకుంటున్నారు.పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం జువ్వలపాలెం గ్రామానికి చెందిన గోకరాజు నాగరాజు పూర్వకాలం నాటి ఆకారంలో అన్ని రకాల హంగులతో సుమారు రెండు కోట్ల రూపాయలతో నిర్మించారు.ఇప్పుడు ఇల్లు కట్టుకునేవారు సాంకేతిక విలువలకు భవన యజమానులు ప్రాధాన్యం ఇస్తున్నారు. పట్టణాల్లో కనిపించే అందమైన భవంతులు పల్లెల్లో కనిపిస్తున్నాయి.ఇటీవల కాలంలో చాలా మంది తమ ఇంటి గోడలను ఆకర్షణీయమైన రూపాలతో నింపేస్తున్నారు.ఇంటికి కొత్త శోభనిస్తున్న ఇంపైన ఇంటీరియర్‌ డిజైన్స్‌ ,పక్షులు, జంతువులు, మొక్కల బమ్మలతో ఆకట్టుకుంటున్న కళాకఅతలు ఇటీవల కాలంలో చాలా మంది తమ ఇంటి గోడలను ఆకర్షణీయమైన రూపాలతో నింపేస్తున్నారు.అనేక టెన్షన్‌లతో ఇంటికి వెళ్తాం.మనకు ఇల్లు ఒక ప్రశాంతతను ఇచ్చేలా ఉంటుంది. ఆ మేరకు ఇంటిని నచ్చినట్టుగా రూపొందించుకుంటున్నారు.అందుకే చాలా మంది వారికి ఎంతో ఇష్టమైన బమ్మలు, ప్రకఅతి దఅశ్యాల పెయింటింగ్స్‌ను వేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.తాటాకిల్లు అయినా, పెంకుటిల్లియినా ఇంట్లో ఉన్న వస్తువులు చక్కగా పేర్చుకోవడంతో ఇల్లు ఇల్లు ఆకర్షణగా కనిపించేవి. గోడలు మెప్పించే అలంకరణలు, జ్ఞాపకాల కథను చెప్పే ఉత్సుకతలు, సౌందర్యాన్ని పరిశీలించే కళాఖండాలు చాలా దూరం వెళ్తాయి. గోడలకుహొపెయింటింగ్‌లనుహొజోడించడం,ఇంటీరియర్‌లను వెలిగించగల ఖచ్చితంగా-షాట్‌ మార్గాలలో ఒకటి .హొతల్లి బిడ్డలప్రేమను సంగ్రహిస్తుంది.హొ గోడ అలంకరణకు ఆధ్యాత్మిక ,కళాత్మక స్పర్శను జోడించినవి అందరిని ఆకట్టుకుంటున్నాయి.ఆకర్షణీయమైన కేంద్ర బిందువును సఅష్టిస్తాయి.హొ పరిసరాలకు సానుకూల శక్తిని జోడించడం ఖాయం.చేతితో తయారు చేసిన పెయింటింగ్‌. దుమ్ము నిరోధకతను కలిగి ఉంటుంది. శుభ్రం చేయడం చాలా సులభం.హొఇది వాటర్‌ ప్రూఫ్‌ కూడా.హొనిజంగా మంత్రముగ్ధులను చేసే వాతావరణం కోసం సంక్లిష్టమైన వివరాలు,ప్రకాశవంతమైన కాంతులతో కనిపిస్తుంది. అద్భుతమైన ఆకర్షణకు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.లిఇంటి ఆవరణే నందనవనం..రాజస్థాన్‌ ఆర్చ్‌, ముంబై,బెంగళూరు, హైదరాబాద్‌ నుంచి ఇంటి నిర్మాణానికి అవసరమైన అన్ని రకాల ఇంటి పరికరాలను తీసుకువచ్చి చక్కటి పెంకిటిల్లు ఇల్లు, పల్లెల్లో ఉండే పలు అంశాలతో పాతకాలం నాటి టెలిఫోన్‌. పల్లెటూరును తలపించేలా పురాతనమైన లాంతర్లు, చెట్టు కొమ్మలపై పక్షులు సినిమా సెట్టింగ్‌ తరహాలో కోట్ల రూపాయలతో అద్భుతంగా పెంకిటిల్లు,ఇంటి ఆవరణ ను నందనవనంగా తీర్చిదిద్దారు.లిపల్లె వాతావరణం, పచ్చదనం…స్వాగతం పలికే, చేపలురొయ్యల చిత్రాలు,కోడిపుంజులు,లాంతరులు,వివిధ రకాల బమ్మల చిత్రాలు ఆకర్షణీయంగా కనిపిస్తాయి.వరి, ఆక్వా సాగులను ప్రతిబించేలా చక్కటి చిత్రాలు అందరిని ఆకట్టుకుంటున్నాయి.పల్లె వాతావరణంలో ఉండే పచ్చదనం. కొల్లేటి కొంగల కోలాహలం. పాతకాలం నాటి గడియారాలు, బ్రిటిష్‌ కాలం నాటి ఫిరంగులు, తల్లి బిడ్డల ప్రేమదనం, సూర్య భగవానుడు, కఅష్ణుడు, వివిధ ఆకారాల్లో వేసిన ఆయిల్‌ పెయింటింగ్స్‌ ఇంటి ఆవరణలో దర్శనమిస్తాయి.ఇల్లు చూడటానికి రెండు కళ్ళు చాలవు.ఆ భవనంలో చెట్టు కొమ్మలపై పక్షులు, కోడి పుంజులు,కుందేళ్లు, పిల్లుల బమ్మలతో ఏర్పాటుచేశారు. ప్రహరీ గోడలపై వివిధ రంగుల్లో వివిధ ఆకఅతుల్లో తీర్చిదిద్దినవి చూపరులను ఆకట్టుకుంటున్నాయి. లిపాత,కొత్తదనం… తొలుత మండవ లోగుళ్ళు ఏర్పాటు చేయాలనుకున్నారు.స్థలం ఎల్‌ ఆకారంలో పాత, కొత్త దనాల్లో సుందరంగా ఇల్లు నిర్మించారు.ఎల్‌ ఆకారంలో ఇల్లు నిర్మించిన తరువాత ఈశాన్యంలో ఖాళీగా ఉంది.ఆప్రాంతంలో రాజస్థాన్‌ ఆర్చ్‌ ను ఏర్పాటు చేశారు.పల్లెటూరు ఉన్నట్టుగా కొత్త తరహాలో నిర్మించారు.ఇంటి నిర్మాణం పల్లెటూరులో ఉన్నట్టుగా పాత, కొత్తదనం ఉట్టిపడేలా నిర్మించి, సినిమా సెట్టింగులా ఏర్పాటు చేసిన వివిధ ఆకఅతులు చూపురులను ఇట్టే ఆకట్టుకుంటాయి. ప్రహరి గోడ మొదలుకొని వరండా, గేటు, కుర్చీలు సోఫాలు వివిధ వస్తువులు పాతతరంలో వాతావరణం ఉండేలా ఏర్పాటు చేసేందుకు స్తోమత మించి కూడా కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నారు.ఇంటికెళ్లగానే పల్లె వాతావరణంలా ఆహ్లాదాన్ని పంచే విధంగా తీర్చిదిద్దారు. ఇళ్లల్లోనే మొక్కలను ప్రత్యేక శ్రద్ధతో పెంచుతున్నారు.ప్రతి గదిలో కొత్తదనం ఉండేలా వివిధ రంగుల్లో తీర్చిదిద్దారు. పాత, కొత్తదనాలను కలగలిపి ఇంటి నిర్మాణం చేపట్టారు.పల్లెటూరు వాతావరణం లో ఉండే అంశాలతో కూడిన చక్కటి పెయింటింగ్స్‌ ప్రహరీ గోడ చుట్టు నిర్మించారు.కుర్చీలు, సోఫాలు, ప్లాస్టిక్‌ పర్నిచర్‌ లను ముంబై,బెంగళూరు పట్టణాల నుంచి తీసుకొచ్చారు. పెంకిటిల్లు తగ్గట్టుగా పెంకులు తీసుకొచ్చి నిర్మాణం చేపట్టారు. పురాతన టెలిఫోన్లు హైదరాబాదు వివిధ ప్రాంతాల నుంచి వివిధ రకాల పక్షులబమ్మలు తీసుకొచ్చి ఇల్లు పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.2023 ఆగస్టులో ఇల్లు నిర్మాణం పూర్తయింది. లిపగలు,రాత్రి వేళాల్లో వేరువేరుగా…పగలు ఒక రీతిలో.. రాత్రి మరో రీతిగా ఇల్లు నేత్రపర్వంగా కనిపిస్తుంది. ఇంటి ఆవరణలో విద్యుత్తు దగదగలు ఇంటి మెటీరియల్‌ అంతా హైదరాబాదు నుంచి తీసుకొచ్చి ఏలూరుపాడుకు చెందిన తాపీ మేస్త్రి బ్రహ్మం చేతుల మీదుగా ఇంటి నిర్మాణం జరిగింది. పెంకులు రెండు సేడులుగా ఉంటాయి. పాతకాలంనాటి స్తంభాలను వైజాగ్‌ కు చెందిన ఇంటీరియర్‌ డిజైనర్‌ సుబ్రహ్మణ్యం సహకారంతో పల్లెటూరు తగ్గట్టుగా పలు రకాల ఆకఅతులకు పలు రకాల పెయింటింగ్‌ ఎంపిక చేసుకుని అందంగా తీర్చిదిద్దారు.ఇంటి వాసాలు, ఇంటి సూర్‌ ఇనుము తో ఏర్పాటుచేశారు.ప్రహరీ గోడ కు చుట్టు పలు రకాల అకఅతులు సిమెంట్‌ తో తయారు చేసినవి.బమ్మలకు వివిధ రకాల మెటల్‌ పెయింట్‌ తో తీర్చిదిద్దడంతో సుందరంగా కనిపిస్తున్నాయి.లిఅభిరుచికి తగ్గట్టుగా ఇంటి నిర్మాణం,గోకరాజు నాగరాజు, జువ్వలపాలెం గ్రామం. కాళ్ళ మండలం. పశ్చిమ గోదావరి జిల్లా.ఇళ్ల నిర్మాణం పోల్చుకుంటే వివిధ ఆకఅతుల్లో బమ్మలు, చక్కటి పార్కులా , సుందరవనంలా తీర్చిదిద్దడానికి ఎంత ఖర్చు చేశాను. అభిరుచికి తగ్గట్టుగా ఇంటి నిర్మాణం చేశాను. ఎక్కువ డబ్బులు హెచ్చించిన ఆనందంగానే ఉంది. ప్రతి సంక్రాంతి పండుగ సమయంలో జువ్వలపాలెం గ్రామం వస్తుంటాం. పల్లె వాతావరణంలో ఇల్లు ఉంది. సంక్రాంతి పండుగ నుంచి బంధువులు స్నేహితులు ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారు ఇక్కడికి వచ్చి ఉండేలా వారికి భోజన వసతి మా అమ్మ1988 నుంచి ఏర్పాటు చేస్తున్నది. ప్రస్తుతం మేము కొనసాగిస్తున్నాం. నేను,అన్నయ్య,తమ్ముడు ఉమ్మడి కుటుంబంగా ఉంటున్నాం.-గొట్టేటి శ్రీనివాసులు, కాళ్ళ మండల ప్రజాశక్తి విలేకరి,సెల్‌ నెంబర్‌ 9397139966పశ్చిమగోదావరి జిల్లా.
➡️