భారత్‌ కో జానో క్విజ్‌తో నా ప్రయాణం

Jan 28,2024 11:11 #Sneha
bharat ko jano quitz

భారత్‌ వికాస్‌ పరిషత్‌ వారు ప్రతి సంవత్సరం నిర్వహించే భారత్‌ కో జానో జాతీయస్థాయి క్విజ్‌ పోటీల్లో నేను రెండోసారి పాల్గొన్నాను. సెప్టెంబర్‌ 26న బ్రాంచ్‌ స్థాయి క్విజ్‌ పోటీల్లో నాతో పాటు, 10వ తరగతి విద్యార్థి శ్రీకర్‌ పాల్గొన్నారు. అక్కడ మాకు ద్వితీయ స్థానం లభించింది. దాంతో మేము రాష్ట్రస్థాయి క్విజ్‌ పోటీకు అర్హత సాధించాము. రాష్ట్ర స్థాయి క్విజ్‌ వాయిదా పడటంతో, మాకు ఎక్కువ సమయం దొరికింది. దాంతో క్విజ్‌ కు బాగా కసరత్తు చేసి, నవంబర్‌ 19వ తారీకున మేము జీూూ కాలేజీ గుంటూరులో జరిగిన, పోటీలో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచాము. దాంతో మేము విశాఖపట్నం లో జరగనున్న దక్షిణ భారత ప్రాంతీయ ప్రాంతీయ స్థాయి క్విజ్‌ పోటీకు అర్హత సాధించాము. మాకు ఉన్నది తక్కువ సమయం అయినా, మా ఉపాధ్యాయుల సహకారంతో క్విజ్‌కి బాగానే తయారయ్యాము. నవంబర్‌ 26వ తారీకు విశాఖపట్నంలో జరిగిన, దక్షిణ భారత క్విజ్‌ పోటీల్లో, ద్వితీయ స్థానంలో నిలిచాము.

ఎంత జ్ఞానం ఉన్నా, ఎన్ని విషయాల పైన అవగాహన ఉన్న, అదష్టం లేనిదే ఏది జరగదు. అలా ఈ సంవత్సరం నా ప్రయాణం ప్రాంతీయ స్థాయితోనే ఆగిపోయింది. కానీ, సంతోషించవలసిన విషయం ఏమిటంటే, పోయినసారి మేము ప్రాంతీయ స్థాయిలో 7వ స్థానంలో నిలిచాము. ఈసారి ఇంకా ఎంతో మెరుగుపడి, 2వ స్థానంలో నిలిచాము. వచ్చే సంవత్సరం జాతీయ స్థాయిలో పాల్గొని, అక్కడ కూడా గెలుస్తానని ఆశిస్తున్నాను. మమ్మల్ని ఎంతగానో, ప్రోత్సహించిన మా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, పాఠశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

 

– బి. తేజ్‌ ప్రమోద్‌, 9 వ తరగతి, అరవింద మోడల్‌ స్కూల్‌, మంగళగిరి.

➡️