బుల్లి బిల్లీ…

Jun 16,2024 12:10 #Sneha

ఒకానొక పూల తోటలో ఒక బుల్లి తేనెటీగ ఉండేది. దానిపేరు బిల్లీ. అది ఎంతో ముద్దుగా ఉండేది. తెలివైనది. ధైర్యం కలది. కడుపునిండా తేనె తాగి, తోటలో ప్రతి రోజూ హాయిగా ఆడుకునేది. అలా ఆడుకోవడమంటే దానికెంతో ఇష్టం. ఒకరోజు బిల్లీ తోటలో ఆడుకుంటుండగా ఒక ఈగ విచారంగా కూర్చుంది. బిల్లీ దాని వద్దకు వెళ్లి దానికి ధైర్యం చెప్పి సహాయం చేసింది. దీంతో అది హాయిగా నవ్వేసింది. రెండూ ఆనందంగా నవ్వుతూ పైకి ఎగిరి ఆడుకున్నాయి.
అరికేరి సమన్విత,
5వ తరగతి, నలంద విద్యా నికేతన్‌, విజయవాడ.

➡️