ఎఐ తో డయాబెటీస్‌కి చెక్‌!

మనదేశంలో జీవనశైలి కారణంగా మధుమేహం వ్యాధి సర్వసాధారణం అయిపోయింది. ఈ మధుమేహం ఒకసారి వచ్చిందంటే జీవితాంతం పోదనే నానుడీ ఉంది. ఈ నేపథ్యంలో మధుమేహ నివారణకు శాస్త్రవేత్తలు వివిధ ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ఇటీవల చెన్నై డయాబెటిస్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ మధుమేహం చికిత్స పద్ధతులను మెరుగుపరచడానికి కృత్రిమ మేధస్సు, డేటా సైన్స్‌, మెషిన్‌ లెర్నింగ్స్‌ను ఉపయోగిస్తుంది. ఫౌండేషన్‌ పరిశోధన చేయడానికి సాంకేతిక సంస్థ ఎంబెడ్‌ యూఆర్‌ సిస్టమ్స్‌తో జతకట్టింది. ఎండీఆర్‌ఎఫ్‌ ఛైర్మన్‌ వి. మోహన్‌ ఈ ప్రయోగం గురించి మాట్లాడుతూ సంస్థ నిరంతరం గ్లూకోజ్‌ మానిటరింగ్‌ (సీజీఎం) ప్యాచ్‌లను ఉపయోగిస్తున్న వారి నుంచి సేకరించిన డేటాపై ఆధారపడుతుందని వారు రోజు మొత్తంలో గ్లూకోజ్‌ వైవిధ్యాలను ట్రాక్‌ చేయడం ద్వారా మరింత మెరుగ్గా సేవలను అందించగలరని తెలిపారు. మద్రాస్‌ డయాబెటిస్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ తాజా ప్రయోగాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ఈ ప్రయోగాల్లో రక్తంలో గ్లూకోజ్‌ హెచ్చుతగ్గులు టైప్‌ 1 / టైప్‌ 2 డయాబెటిస్‌ను అంచనా వేయడంలో సహాయపడతాయో? లేదో? కనుగొనడం లక్ష్యాలలో ఒకటి. డేటా సంక్లిష్టతలను అంచనా వేయడంపై సమాచారాన్ని అందించగలదని డాక్టర్‌ మోహన్‌ చెప్పారు. ఎండీఆర్‌ఎఫ్‌ తన రోగులకు ఇచ్చిన సీజీఎం సిస్టమ్‌ల నుంచి దాని రీడింగ్‌ల డేటాసెట్‌ను ఎంబెడ్‌యూఆర్‌తో పంచుకుంటుంది. ప్రస్తుతం రక్తంలో చక్కెర స్థాయిని మాత్రమే పరిశీలిస్తామని మోహన్‌ వివరించారు. వైద్యులు చికిత్స ప్రోటోకాల్‌లను మెరుగుపరచడంలో, సంభవించే సంక్లిష్టతలను అంచనా వేయడంలో సహాయపడే నమూనాల కోసం డేటా ఉపయోగిస్తామని మోహన్‌ చెప్పారు.
సీజీఎం అనేది ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ని ఉపయోగించే మెడికల్‌ ధరించగలిగే పరికరమని నిపుణులు చెబుతున్నారు. డేటాసెట్‌ల నుంచి తక్కువ షుగర్‌ లేదా హై షుగర్‌ ఈవెంట్‌ల వంటి మార్కర్‌ల సెట్‌ సేకరిస్తారు. అలాగే నమూనాల కోసం విశ్లేషిస్తూ ఉంటారు. కంపెనీలోని ఇంజనీర్లు డేటాను అధ్యయనం చేసి, మధుమేహం ఉన్న వ్యక్తికి నిర్దిష్ట మార్కర్లను కలిగి ఉన్న ఆరోగ్య సమస్యలను అంచనా వేయడానికి ఉపయోగించే మోడల్‌ను అభివృద్ధి చేస్తారు. అలాగే పరిశోధకులు ఈ ప్రయోగాల్లో భాగంగా మానవ జన్యు పరిశోధనకు సమాంతరాలను రూపొందించారు. తరువాత మధుమేహాన్ని అధ్యయనం చేయడానికి జన్యుశాస్త్రంలో నాన్‌-హైపోథీసెస్‌ ఆధారిత విధానాన్ని ఉపయోగించారు. ఇది అంతకుముందు తప్పిపోయిన కీలక జన్యువులు, మార్గాలను గుర్తించడంలో సహాయపడింది.

 


అతను వ్యాధిని జయించాడు..
డయాబెటిస్‌.. ఒక్కసారి దీని బారినపడ్డామంటే ఇక బయటపడేదే లేదు. అయితే, ఎఐ సాయంతో ఓ వ్యక్తి షుగర్‌ వ్యాధిని జయించాడు. వ్యాధిని పూర్తి నియంత్రణలోకి తెచ్చుకున్నతడు తన శరీరంపై వ్యాధి తాలూకు ప్రతికూల ప్రభావాలన్నీ పూర్తిగా తొలగించుకున్నాడు. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. డెవ్లిన్‌ డోనల్డ్‌సన్‌ ఓ ఎన్‌జీవో సంస్థకు సీఈఓ. చాలా కాలంగా అతడు టైప్‌ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్నాడు. ఎన్ని మందులు వాడినా ఉపయోగం లేకపోయింది. ఆహార నియమాలు పాటించడంలో అతడి నిర్లక్ష్యం కూడా పరిస్థితిని మరింత దిగజార్చింది. ఇలాంటి పరిస్థితుల్లో అతడు డిజిటల్‌ ట్విన్‌ అనే యాప్‌ వాడటం ప్రారంభించాడు (వీaఅ ఔష్ట్రశీ =వఙవతీరవస నఱర ణఱabవ్‌వర Aఅస ూశీర్‌ 18 ఖస్త్ర బరఱఅస్త్ర సఱస్త్రఱ్‌aశ్రీ ్‌షఱఅ aజూజూ). ఎఐ ఆధారంగా నడిచే ఈ యాప్‌ డయాబెటిస్‌ రోగిపై పూర్తి నిఘా పెడుతుంది. రోగి ఆహారం, రక్తంలో చెక్కర స్థాయిలు, కసరత్తుల తీరుతెన్నులు, మందులు, నిద్ర ఇలా అన్ని విషయాలను నిశితంగా గమనించి, ఎప్పటికప్పుడు మార్పులు సూచిస్తుంది. రోగుల శరీర తత్వానికి తగినట్టు సూచనలు ఇస్తుంది. డెవ్లిన్‌కు మొదట్లో ఈ యాప్‌పై ఎన్నో సందేహాలు ఉన్నప్పటికీ ఓసారి ప్రయత్నిస్తే పోయేదేముందనే ఉద్దేశంతో దీన్ని వాడటం ప్రారంభించారు. కానీ యాప్‌ సూచనలు యథాతథంగా పాటించడంతో మూడేళ్లల్లో పరిస్థితి పూర్తిగా ఆయన నియంత్రణలోకి వచ్చేసింది. ఈ కాలంలో అతడు ఏకంగా 18 కేజీల బరువు కూడా తగ్గాడు.
‘మొదట్లో దీన్ని నేను పెద్దగా నమ్మలేదు. సందేహాలతోనే ప్రయాణం ప్రారంభించాను. యాప్‌తో పాటు వచ్చిన బాక్సులోని డిజిటల్‌ స్కేల్‌, బీపీ కఫ్‌, స్మార్ట్‌వాచ్‌, కంటిన్యూయన్‌ గ్లూకోజ్‌ మానిటర్‌ వంటివన్నీ యాప్‌ చెప్పినట్టు ఉపయోగించాను. దీంతో, నా జీవనశైలిని అధ్యయనం చేసింది యాప్‌. అందుకు అనుగూణంగా మందులు, కసరత్తులు, ఆహార నియమాలను యాప్‌ నాకు సూచించేది. ఇది తింటే షుగర్‌ బాగా కంట్రోల్‌లో ఉందని చెప్పేది. ఇంకో ఫుడ్‌ తింటే షుగర్‌ పెరిగిందని చెప్పేది. చూస్తుండగానే ఇది నా జీవితంలో ఓ భాగమైపోయింది. నెల తిరిగేసరికల్లా గణీయమైన మార్పు కనిపించింది. భవిష్యత్తులో వైద్య రంగంలో రాబోయే మార్పులకు ఇది ఓ సూచన’ అని అతడు చెప్పుకొచ్చారు.

➡️