మా గ్రామీణ ప్రాంత విశేషాలు….

Jun 16,2024 11:52 #Sneha, #special children

నాకు నచ్చిన గ్రామాలు రెండు. అవి పాతూరు, నేలకొండపల్లి. పాతూరు మా ఊరు. నేలకొండపల్లి మా అమ్మవాళ్ల ఊరు. మా తాతయ్య గారు పచారీ కొట్టుపెట్టుకున్నారు. అమ్మమ్మ చనిపోయింది. పల్లెటూరిలో ఉదయాన్నే కూ.. కూ.. అని వినిపించే పక్షుల కిలకిలారావాలు మనసుకు హాయినిస్తాయి. మబ్బులను పక్కకు నెట్టుకుంటూ ఉదయించే సూర్యుడిని చూస్తుంటే ఎంతో ఆహ్లాదభరితంగా ఉంటుంది.
మా ఊరు ఆనందమైన గ్రామం. 2000 మంది నివసిస్తున్నారు. పల్లెటూరు కదా ఆ మనుషుల్లో ఆప్యాయతలు ఉంటాయి. ఆప్యాయతలైనా, కోపతాపాలైనా అందరూ ఒకే మాట అనుకొని ఉంటారు. అందులోనే మేము ఎంతో ఆనందంగా కలిసిమెలిసి ఉంటాము. మా ఊరివాళ్ళు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తారు. మా ఊరిలో వేసే పంటల సాగు ఏమిటంటే! వరి, మామిడి, ఆకుకూరలు, అరటి, నేరేడు, కంద, పసుపు, బంతిపూలు, రోజాలు, గోంగూర వంటివి పండిస్తున్నారు. ఇది మా ఊరు కథ.
మరి మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో మినుములు పండిస్తారు. ఆ ఊరి వాతావరణం చాలా బాగుంటుంది. అక్కడ రెండు దుకాణాలు ఉంటాయి. ఇవి మా గ్రామీణ ప్రాంత విశేషాలు. నాకు తెలిసిన ఒక చిన్న సామెత. ‘నోరు మంచిదైతే ఊరు మంచిది’ అంటారు పెద్దలు.

ఎస్‌. సౌజన్య,
7వ తరగతి, అరవింద హైస్కూల్‌,
కుంచనపల్లి, గుంటూరు.

➡️