హాయ్ ఫ్రెండ్స్‌.. బాగున్నారా..!

Jun 16,2024 10:05

ఈ వేసవి సెలవుల్లో డ్యాన్స్‌ చేస్తూ సరదాగా, సంతోషంగా, ఉత్సాహంగా గడిపాను. లహరి డ్యాన్స్‌ అకాడమీ మాస్టర్‌ హరిప్రసాద్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మర్‌ క్యాంప్‌ శిక్షణా శిబిరంలో చేరి డ్యాన్స్‌ నేర్చుకున్నాను. ప్రతిరోజు డ్యాన్స్‌ చేస్తూ అటు శారీరకంగా ఇటు మానసిక ఉల్లాసాన్ని పొందాను. ఈ క్యాంప్‌లో నాతో పాటు చేరిన వారంతా మంచి ఫ్రెండ్స్‌ అయ్యారు. ఈ సమ్మర్‌ క్యాంపు పూర్తయ్యాక ఏర్పాటు చేసిన స్టేజి ప్రోగ్రాంలో నాతోపాటు ప్రతిభ కనబరిచిన వారందరికీ ప్రశంశాపత్రము, జ్ఞాపికలను మా డ్యాన్స్‌ మాస్టర్‌ హరిప్రసాద్‌ చేతులమీదుగా అందించారు. చదువుతో పాటు డ్యాన్స్‌లోనూ బాగా రాణించాలని మాస్టర్‌ చెప్పారు. మీరు కూడా ఈ వేసవి సెలవులను ఆటపాటలతో బాగా ఎంజారు చేసి ఉంటారని భావిస్తున్నాను ఫ్రెండ్స్‌. బా బాయ్ బాయ్ ..! ఫ్రెండ్స్‌.!
ఆకుల చైతన్యరాయ్,
రెండవ తరగతి,
సివిఆర్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌, అనంతపురం.

➡️