కృష్ణయ్య తెలివి..!

Jun 16,2024 11:06 #chirumuvallu, #Sneha

అనగనగా ఒక ఊరిలో కృష్ణయ్య అనే ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు రోజంతా పొలంలో కష్టపడి పనిచేసి వాళ్ల కుటుంబాన్ని పోషిస్తుండేవాడు. రైతుకు పొలంపని కోసం చాలా నీళ్లు అవసరమయ్యేవి. కానీ, తన దగ్గర నీళ్ల సదుపాయం ఉండేది కాదు. తన పొలం పక్కనే రంగయ్యకు చెందిన బావి ఉండేది. ఒకరోజు కృష్ణయ్య ఆ రంగయ్య బావిని కొనుక్కోవాలని అనుకుంటాడు. తను అనుకున్నట్లే రంగయ్య దగ్గరకు వెళ్లి వంద రూపాయలు చెల్లించి బావిని కొనుక్కుంటాడు. కృష్ణయ్య చాల సంతోషంగా బావి నుంచి నీళ్లు తోడుకుంటాడు. అప్పుడు రంగయ్య వచ్చి ‘కృష్ణయ్య ఈ బావి మాత్రమే నీది..! ఆ నీళ్లు నావి..! ఆ నీళ్లు కావాలంటే పన్ను కట్టవలసి ఉంటుందని’ అంటాడు. కృష్ణయ్య బాధపడతూ తనలో తాను కుమిలిపోతుంటాడు. ఇంతలో కృష్ణయ్యకు మంచి ఉపాయం తడుతుంది. అప్పుడు కృష్ణయ్య ‘రంగయ్య..! ఈ బావి నాది..! నీ నీళ్లు నాబావిలో ఉండాలంటే నాకు నువ్వు అద్దె కట్టాలి. లేదా నా బావి నుంచి నీటిని తీసేరు’ అంటాడు. ఆ మాటలకు రంగయ్య భయపడి నీటిని, బావినీ కృష్ణయ్యకు ఇచ్చేస్తాడు. ఉపాయంతో ఎంతటి అపాయాన్నైనా తొలగించొచ్చు.

జి.గగన్‌ గిరీష్‌, 7వ తరగతి,

జెడ్‌పిహెచ్‌ స్కూల్‌, నర్సీపట్నం.

➡️