నేర్చుకో.. నేర్చుకో..

Jun 16,2024 11:02 #kavithalu, #Sneha

చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో..
భూమిని చూసి ఓర్పును నేర్చుకో..
చెట్టును చూసి ఎదుగుదలను నేర్చుకో..
ఉపాధ్యాయుని చూసి సుగుణాలు నేర్చుకో..

గుణగణాలన్నవి ఒక చెట్టు లాంటివి
పేరు ప్రతిష్టలన్నవి నీడలాంటివి
చెట్టును గురించిన మన ఆలోచన నీడవుతుంది
కానీ నిజమైనది చెట్టు మాత్రమే..!

వి.కావ్యశ్రీ, 7వ తరగతి,
జెడ్‌పిహెచ్‌ స్కూల్‌, ఎదురు,అత్తిలి మండలం

➡️