విద్యార్థుల కోసం కొత్త యాప్‌..

Mar 17,2024 07:30 #Sneha, #student app

విద్యార్థుల కోసం ప్రత్యేక యాప్‌ వచ్చేసింది.. ఇకపై మ్యాథ్స్‌ ఫోటోమ్యాత్‌ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది విద్యార్థులకు గణితాన్ని నేర్చుకోవడానికి, అభ్యాసం చేయడానికి, అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది.
చాలా మంది విద్యార్థులకు మ్యాథ్స్‌ అంటి భయం. ఎందుకుంటే గణిత సమస్యలను పరిష్కరించడం అందరికీ అంత సులభం కాదు. అయితే దానిలో లాజిక్‌ తెలుసుకుంటే దానంత సులువూ ఉండదు. గణిత సమస్యలను పరిష్కరించడం చాలా మంది విద్యార్థులకు కష్టమైన పని. దీనివల్ల చాలా మంది విద్యార్థులు మ్యాథ్స్‌ అంటేనే వణికిపోతుంటారు. మ్యాథ్స్‌ సబ్జెక్టుకు దూరంగా ఉంటుంటారు. అదే సమయంలో గణితాన్ని ఇష్టపడే విద్యార్థులు కూడా ఉంటారు. అయితే.. మ్యాథ్స్‌ అంటే ఇష్టపడే, భయపడే విద్యార్థులందరికీ సహాయం చేయడానికి గూగుల్‌ ఈ ఫోటోమ్యాత్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.


ఎలా పనిచేస్తుందంటే..
గూగుల్‌ కొత్తగా తెచ్చిన ఫోటోమ్యాథ్‌ (ూష్ట్రశ్‌ీశీఎa్‌ష్ట్ర) యాప్‌తో మీరు మ్యాథ్స్‌ ప్రాబ్లెమ్‌ పరిష్కరించాలి అంటే.. ఈ యాప్‌లో ఒక్క ఫోటో తీస్తే చాలు. మీకు సమాధానం వచ్చేస్తుంది. ఈ యాప్‌ ఒక స్మార్ట్‌ కెమెరా కాలిక్యులేటర్‌, మ్యాథ్స్‌ అసిస్టెంట్‌ యాప్‌. ఇందులో ఫోటో తీయడం ద్వారా మ్యాథ్స్‌ ఈక్వేషన్‌లు పరిష్కరించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. కనుక ఇది మీకు కష్టమైన త్రికోణమితి, బీజగణిత సమీకరణం కావచ్చు.. ఈ యాప్‌ దశల వారీ పరిష్కారాలతో దాన్ని అర్థం చేసుకోవడంలో మీకు సహాయం చేస్తుంది. ఇది మీకు ఒక ఉత్తమ ఉపాధ్యాయుడిలా సహాయపడుతుంది.
ఈ యాప్‌ గూగుల్‌ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంది. ఇది గణిత విద్యార్థులకు సహాయపడే గూగుల్‌ ప్రత్యేక యాప్‌. గూగుల్‌ ఈ యాప్‌ను 2023లో కొనుగోలు చేసింది. ఈ యాప్‌ను స్మార్ట్‌ కెమెరా కాలిక్యులేటర్‌ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది కెమెరా కాలిక్యులేటర్‌ లాగా పనిచేస్తుంది. ఇది ఏదైనా గణిత సమస్య ఫొటో చూసి, దాని పరిష్కారాన్ని కనుగొంటుంది. విద్యార్థులు ఏదైనా గణిత ప్రశ్నకు సంబంధించిన ఫోటోను ఈ గూగుల్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తే.. యాప్‌ ఆ ప్రశ్నకు దశల వారీగా పరిష్కారాన్ని అందిస్తుంది.

➡️