సాగనీ..

Mar 24,2024 09:04 #Poetry, #Sneha

ఆపకు నీ ప్రయాణం
దేనికీ భయపడి..
ఈ రాతిరి మాసిన వెలుగు
రేపటికి నీకై..
రగులుతూ ఎదురవుతుంది!
సాగే సెలయేరు
దారి తప్పకుండా
నీకు బాట వేస్తుంది
కొండగాలి నువు కుంగకుండా
భుజం తడుతుంది
విశ్వమంతా తలుపు తెరిచి
నిను ఆహ్వానిస్తోంది..
అందుకే సాగిపో.. ఎప్పటికీ..!

– సురేష్‌ సారిక

➡️