సాహిత్య పరిమళాలు

Jan 14,2024 07:54 #Sneha
kavitha

నా కళ్ళే కలలైతే..!

అదేంటో విచిత్రంగా

నీకళ్ళు నెత్తికెక్కి

కలలు కనేస్తున్నాయి

ఆశల పల్లకీలో ఊరేగింపు

చేసినవి చూసినవి

తోచినవి దాచినవి

అన్నింటినీ బాగా చూర్ణం చేసి

చిక్కగా కలలు కనేస్తున్నాయి

పేరు కోసం పాట్లు

ప్రేమ కోసం అగచాట్లు

కాదనలేని ఇక్కట్లు

చీకటిలో మిరుమిట్లు

జతకట్లు కనికట్లు

పట్టులేని పాళి పాట్లు

మొహం మీదే చీవాట్లు

అన్నింటినీ దారానికి కూర్చి

ఒత్తుగా కలలు కనేస్తున్నాయి

మాయమాటలు

వెకిలింతల చేష్టలు

వేసే వలలు.. తీసే గోతులు

మోసే నిందలు అవమానాలు

ఆవేశాలు అనర్థాలు

ఎదుగుటకై ఆంక్షలు

ఏకాంత సేవలు

వీటన్నింటినీ బాగా కలిపి

రాశిగా కలలు కంటున్నాయి

ఒకటేమిటి..ఆనందం దుఃఖం పరిచయం

అనుభవం విచిత్ర గమనం

నా కంట పడిన ప్రతి దానిని

కలలో మంటలై వెలిగిస్తున్నాయి

కాదేదీ కలకు అనర్హం అన్నంతగా

కళ్ళు కలలు కనేస్తున్నాయి

 

  • నరెద్దుల రాజారెడ్డి, 9666016636
➡️