రిఫ్రెష్‌మెంట్‌ క్యాంప్‌ 2024

Apr 14,2024 13:42 #Refreshment Camp 2024, #Sneha

వైజాగ్‌ చిల్డ్రన్స్‌ క్లబ్‌ (విసిసి) ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీ నుండి 7వ తేదీ వరకూ రిఫ్రెష్‌మెంట్‌ క్యాంప్‌ జరిగింది. ఇందులో స్టీల్‌ ప్లాంట్‌లో చదువుతున్న పదవ తరగతి, ఇంటర్మీడియట్‌, పాలిటెక్నిక్‌, ఐ.టి.ఐ విద్యార్థులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యార్థులు – ఉపాధి, విద్యార్థులు – శాస్త్రీయ ఆలోచన, పది, ఇంటర్‌ తరువాత విద్యావకాశాలు, డిజిటల్‌ టెక్నాలజీ, ప్రస్తుత ప్రపంచం, ఎన్నికలపై డిబేట్‌, విద్యార్థుల ఆసక్తికి అనుగుణంగా పోస్టర్‌, కథా రచన, డ్యాన్సు వంటి విషయాల్లో శిక్షణ ఇచ్చారు.


ఈ క్యాంపుకి హాజరైన విద్యార్థులు ఐదు బృందాలుగా ఏర్పడ్డారు. వీరు రెండవ రోజు రాత్రి స్టీల్‌ ప్లాంట్‌ నిర్వాసితుల కాలనీలకు (పెద కోరాడ, నీలాపు వీధి, హౌసింగ్‌ బోర్డ్‌ కాలనీ, నమ్మి దొడ్డి, గంగవరం) వెళ్లాయి. అక్కడ పిల్లలు, పెద్దవాళ్ళతో మీటింగ్‌ పెట్టి విసిసి గురించి, సమ్మర్‌ క్యాంపు గురించి చెప్పారు. ఆ రాత్రి అక్కడే వారి ఇళ్ళల్లో భోజనం చేశారు. పిల్లల పట్ల కాలనీవాసులు చూపిన ఆదరణ, అభిమానం అందరినీ ఆకట్టుకుంది. వారంతా తమ ప్రాంతాల్లో పిల్లల అభివృద్ధి కోసం తప్పకుండా పని చేస్తామని చెప్పారు. ఈ క్యాంపు మరచిపోలేని అనుభవం ఇచ్చింది. చదువుతో పాటు చేయవలసినవి అనేక పనులు వున్నాయని పిల్లలంతా గుర్తించారు.


– డా. కె. రమాప్రభ
94923 48428

➡️