మౌనపద్యం

Apr 14,2024 13:22 #Sneha

కళ్ళతో మాట్లాడుతూ…
కన్నీరును వదులుతుంటావే…
బాధలోనూ నేనున్నట్లేగా?

ఆలోచనల్లో పడుతూ…
ఆదమరుస్తుంటావే…
ఆ ఆలోచనల్లోనూ మెదులుతున్నట్లేగా?

గుండెను తడుతూ…
శబ్దం వినాలనుకుంటావే…
ఆ గుండెలో ఏడుస్తోంది నువ్వేగా?

కోపం నా మీదనో?
నా ప్రేమ మీదనో?
నువ్వూ నేను ఓ మౌనపద్యమేగా?

అల్లుకుంటూ పోయాక
నీకైనా నాకైనా
చివరికి ముడి పడాల్సిందే..?

నా పేరు పలుకుతున్నాక
నీ గొంతు శృతి నేతిలో తడిసిందేమో?
తీయని ప్రేమ రాగమేదో వినపడుతోంది!

నీ పేరు నా పేరు కలిసాక
మరొక పద్యమే అవసరంలేదేమో?
మౌనపు పద్యాలు
మనతో పురుడుపోసుకుంటాయిగా??

కుంచెశ్రీ
9908830377

➡️