మరువలేని జ్ఞాపకాలు

Jun 16,2024 10:59 #kavithalu, #Sneha

చిన్నతనంలో ఆనందంగా బడిలో చేరిన రోజు
ఒకరికొకరు ఆత్మీయంగా స్నేహంగా కలిసిన రోజు
ముద్దు ముద్దుగా మొదటిసారి అందరి ముందు గేయాలు పాడిన రోజు
సంతోషంతో కేరింతలు కొట్టిన రోజు
పాఠశాలలో మొదటిసారి గురువు చేతిలో దెబ్బలు తిన్న రోజు
మరువలేని జ్ఞాపకాలు కూర్చుకున్న రోజు
చిలిపి చేష్టలు చేసి దొరికిన వేళ
స్నేహితులతో కలిసి ఆడుకున్న రోజు
పరీక్షలు వస్తే కంగారు పడిన రోజు
అందరితో కలిసి బయటకు వెళ్ళిన రోజు
నేస్తాలతో బాధలు పంచుకున్న రోజు
ఇది మా అరవింద పాఠశాలలో గడిపిన చివరి రోజు
ఈ తొమ్మిది సంవత్సరాలు అరవిందలో
విరబూసిన నా జ్ఞాపకాల రోజులు!

బి. అనన్య, 10వ తరగతి
అరవింద మోడల్‌ స్కూల్‌,మంగళగిరి.

➡️