బొగ్గు రవాణా అదానీకే

Dec 31,2023 08:35 #Adani, #Coal transportation
  • రాయలసీమ థర్మల్‌లో రివర్స్‌ మాయాజాలం
  • మొదట్లో ఎల్‌-3గా ఉన్నా… తరువాత ఎల్‌-1గా

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : రాష్ట్రంలో అదానీ వ్యాపార సామాజ్య్ర విస్తృతి కొనసాగుతోంది. తాజాగా బొగ్గు రవాణా రంగంలోనూ ఆ సంస్థ అడుగుపెటింది. రాయలసీమ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి అవసరమైన బొగ్గును సరఫరా చేసే కాంట్రాక్టును ఆ సంస్థ దక్కించుకున్నట్లు తెలిసింది. సాధారణ టెండర్‌ విధానంలో కాకుండా రివర్స్‌ టెండర్‌ మాయాజాలంలో ఆ సంస్థ ఈ టెండర్‌ను దక్కించుకుంది. ఈ మేరకు త్వరలోనే జెన్‌కో అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలిసింది. ఏడాదికి 40 లక్షల మెట్రిక్‌ టన్నుల చొప్పున మొత్తం 80 లక్షల మెట్రిక్‌ టన్నుల బొగ్గును సరఫరా చేసేరదుకు బిడ్లు ఆహ్వానించగా, అరదులో ఏకంగా 60 లక్షల మెట్రిక్‌ టన్నుల సరఫరాను అదానీకి అప్పగించనున్నట్లు సమాచారం. దీనిపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యం మిగిలిన 20 లక్షల మెట్రిక్‌ టన్నుల బొగ్గు సరఫరాను వేరే సంస్థకు అప్పగించాలని నిర్ణయించారు. వాస్తవానికి ఈ బొగ్గును సముద్ర, రైల్‌, రోడ్డు మార్గాల ద్వారా సరఫరా చేసేందుకు బిడ్లను ఆహ్వానించగా మొత్తం ఆరు సంస్థలు ముందుకొచ్చాయి. ఈ నెల 11వ తేదీన బిడ్లను తెరువగా, అందులో అదానీ సంస్థ ఎల్‌-3గా నిలిచింది. ఎల్‌-1గా రిప్లే సంస్థ, ఎల్‌-2గా ఎంబిజి సంస్థ నిలిచాయి. దీంతో టెరడర్‌ రిప్లే సంస్థకే ఖాయమనుకున్న దశలో రివర్స్‌ టెండర్‌కు మళ్లీ బిడ్లు పిలిచారు. దీనిని అదాని గ్రూపు దక్కించుకున్నట్లు చెబుతున్నారు. తొలుత దాఖలు చేసిన టెండర్లలో రిప్లే సంస్థకు, అదానీ సంస్థ కేవలం 11 రూపాయల వ్యత్యాసమే ఉంది. అయితే రివర్స్‌ టెండరింగ్‌లో అదానీ తన సొంత ఓడరేవుగా ఉన్న కృష్ణపట్నం నుంచి బొగ్గు అందించేందుకు నిర్ణయించగా, రిప్లే సంస్థ మాత్రం చెన్నై ద్వారా అందించేందుకు ప్రతిపాదించాయి. ఇదే సమయంలో మెట్రిక్‌ టన్నుకు విలువను కూడా మరింతగా తగ్గించేందుకు అదానీ, రిప్లే సంస్థలు పోటీపడడంతో రివర్స్‌ టెండరింగ్‌లో దాదాపు 16.62 శాతం టెండర్‌ విలువ తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. పోర్టు నుంచి ఆర్‌టిపిపికి బొగ్గు సరఫారా ఛార్జీలను అదానీ మరింతగా తగ్గించి కోట్‌ చేసినట్లు సమాచారం.

ముందే సన్నాహాలు

అదానీకి టెండర్‌ ఖరారు చేసినప్పటికీ ఇంకా బోర్డు అనుమతి ప్రకటించాల్సి ఉంది. అయితే అదానీ సంస్థ మాత్రం ఈ నెల 22వ తేదీ నుంచే సరఫరా పనులు ప్రారంభించేందుకు జెన్‌కో అనుమతి కోరడం విశేషం. అమాగే తాల్చేర్‌ నుంచి అదే రోజు రేక్‌ల ద్వారా బొగ్గు లోడింగ్‌ కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇంత హడావుడిగా అదానీ టెండర్‌ ఖరారు చేయడమే కాకుండా బోర్డు అనుమతికి ముందుగానే సరఫరా పనులకు కూడా ఆమోదం తెలపడం చర్చనీయాంశంగా మారింది.

➡️