రాష్ట్రంలో ఎన్నికల జాతర

Apr 9,2024 07:38 #2024 elections, #ap election
  •  పాలుపంచుకోబోతున్న 4.9 కోట్ల ఓటర్లు
  •  25 పార్లమెంట్‌, 175 అసెంబ్లీ స్థానాలకు
  • మే 13న పోలింగ్‌
  •  మరో పది రోజుల్లో ప్రారంభం కానున్న నామినేషన్ల పర్వం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎన్నికల జాతరకు ఆంధ్రప్రదేశ్‌ సమాయత్తమవుతోంది. కులాలు, ప్రాంతాలు, మతాలతో సంబంధం లేకుండా కోలాహలంగా నిర్వహించుకునే ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగను విజయవంతం చేసేందుకు ప్రజానీకమూ సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలోని దాదాపు నాలుగుకోట్ల మంది ఓటర్లు మరో 35 రోజుల్లో జరగనున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పాలుపంచుకుని రాష్ట్ర భవిష్యత్‌కు బాటలు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఓ వైపు పోటాపోటీ ప్రచారాలు, మరోవైపు ఉత్తేజపరిచి, ఉత్సాహ పరిచే మేనిఫెస్టోలు, హామీలతో ఉక్కిరిబిక్కిరవుతోన్న ప్రజానీకం వేలాది మంది అభ్యర్థుల తలరాతలను మార్చేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం జరగబోయే ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్‌కు, ప్రజల భవితవ్యానికి సంబంధించి అత్యంత కీలకమైనవి కానుండటంతో ఓటర్లంతా ఉత్సాహంగా ఈ ఓట్ల పండుగలో భాగస్వాములయ్యేందుకు సంసిద్ధమవుతున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 4,09,37,352 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోబోతున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత జరగుతున్న మూడవ అసెంబ్లీ ఎన్నికలు కావటం, ఓటర్ల సంఖ్య కూడా తొలిసారి నాలుగు కోట్లు దాటడంతో ప్రధాన పార్టీలు, అభ్యర్థులందరూ గంపెడాశలు పెట్టుకున్నారు. మరోవైపు ఎన్నికల ప్రవర్తనా నియమావళి గత నెల 16 నుంచి అమల్లోకొచ్చింది. సాధారణ పరిపాలన కొనసాగుతోంది. ఎన్నికల కమిషన్‌ నియంత్రణలో ప్రభుత్వ యంత్రాంగం పని చేస్తోంది. కోడ్‌ వంకతో ప్రజలకు మామూలుగా రోజువారీ పనులు కూడా కాక ఇబ్బందులు పడుతున్నారు.

ఎన్నికల తేదీ – మే 13
నామినేషన్ల ప్రారంభ తేదీ – ఏప్రిల్‌ 18
నామినేషన్లకు చివరి తేదీ – ఏప్రిల్‌ 25
నామినేషన్ల పరిశీలన -ఏప్రిల్‌ 26
నామినేషన్ల ఉపసంహరణ-ఏప్రిల్‌ 29
ఎన్నికల కౌంటింగ్‌ తేదీ – జూన్‌ 4.

మొత్తం పోలింగ్‌ స్టేషన్లు – 46,165
అర్బన్‌ పోలింగ్‌ స్టేషన్లు -34,120
గ్రామీణ ప్రాంత పోలింగ్‌ స్టేషన్లు – 12,045

అసెంబ్లీ నియోజకవర్గాలు – 175 (139-జనరల్‌), (29-ఎస్సి), (7-ఎస్టి)
పార్లమెంట్‌ స్థానాలు – 25 (20-జనరల్‌), (04-ఎస్సి), (01-ఎస్టి)
ఎన్నికల కోసం ఉపయోగించబోయే ఇవిఎమ్‌ మెషన్లు – 1,15,416

(2024 -అంచనా)
రాష్ట్ర జనాభా 5,63,92,350
పురుషులు 2,76,32,352
స్త్రీలు 2,87,60,098
మొత్తం ఓటర్లు 4,09,37,352
పురుష ఓటర్లు -2,00,84,276
మహిళా ఓటర్లు -2,08,49,730
థర్డ్‌ జెండర్‌ ఓటర్లు -3,346
ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు – 7,763
సర్వీసు ఓటర్లు – 67,393
18-19 వయసు ఓటర్లు -9,01,863
దివ్యాంగ ఓటర్లు -5,17,140
85+ ఏళ్ల వయసు ఓటర్లు -2,12,237

ఎన్నికల నిర్వహణ కోసం
కేటాయించబడిన మొత్తం అధికారులు-3,82,218
రిటర్నింగ్‌ అధికారులు -175/25
ఎఆర్‌ఓ -798/207
ఇఆర్‌ఓ -175
ఎఇఆర్‌ఓ -1079
సెక్టార్‌ ఆఫీసర్లు -5,067
సెక్టార్‌ పోలీస్‌ ఆఫీసర్లు -5,076
మైక్రో అబ్జర్వర్స్‌ -18,961
ప్రిసైడింగ్‌ ఆఫీసర్లు -55,269
పోలింగ్‌ ఆఫీసర్లు -2,48,814
బిఎల్‌ఒ -46,165
జిల్లా నోడల్‌ అధికారులు -416

➡️