డ్రగ్స్‌తో రాజకీయ ప్రకంపనలు

Mar 23,2024 10:35 #Drugs, #political turmoil
  • టిడిపి, బిజెపి, వైసిపిల పరస్పర ఆరోపణలు
  • మాపై ఒత్తిడి లేదు : విశాఖ సిపి

ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో, యు.కొత్తపల్లి (కాకినాడ జిల్లా) : విశాఖ పోర్టులో భారీగా పట్టుబడిన డ్రగ్స్‌ వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎన్నికల సమయం కూడా కావడంతో టిడిపి, బిజెపి, వైసిపిలు పెద్ద ఎత్తున పరస్పర విమర్శలకు దిగుతున్నాయి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా డ్రగ్స్‌ వ్యవహారంతో రాజకీయ పార్టీల పేర్లు ముడిపడటం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు శుక్రవారం నాడు ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న సంధ్యా అక్వా పరిశ్రమలో సిబిఐ దాడులు కొనసాగాయి. కాకినాడలోని ఆ సంస్థ కార్యాలయంఓ గురువారం సాయంత్రం నుండి శుక్రవారం సాయంత్రం వరకు 24 గంటల పాటు తనిఖీలు కొనసాగాయి. పట్టుబడిన సరుకుకు ఉన్నతాధికారుల సమక్షంలో మరోసారి పరీక్షలు నిర్వహించడానిక సిబిఐ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై విలేకరులతో మాట్లాడిన విశాఖ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఎ. రవిశంకర్‌ తమపై ప్రభుత్వ ఒత్తిడి ఉందన్న ఆరోపణలు తోసిపుచ్చారు. తమపై ఎవరి ఒత్తిడి లేదని ఆయన స్పష్టం చేశారు. సిబిఐ అధికారులు సమర్పించిన నివేదికలో తమపై చేసిన వ్యాఖ్యలే కేవలం సాంకేతికమేనని ఆయన చెప్పారు.

డ్రగ్స్‌ వెనుక ఎవరు…?
సంధ్యా అక్వాలో సిబిఐ తనిఖీలు ఇంకా కొనసాగుతుండగానే ఈ రాకెట్‌ వెనక ఉన్నదెవరు అన్న అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. డ్రగ్స్‌ పట్టుబడిన విషయం బయటకు వచ్చిన కొన్ని గంటల్లోనే వైసిపి నాయకత్వంపై టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి లోకేష్‌లు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత కాసేపటికి వైసిపికూడా టిడిపిపై ఇదేరకమైన ఆరోపణలు చేసింది. ఆ కేసులో కీలకంగా ఉన్న సంధ్యా ఆక్వాకు చెందిన కోటయ్య చౌదరికి టిడిపి నేతలకు సన్నిహిత సంబంధాలున్నాయని ఆ పార్టీ పేర్కొంది. చంద్రబాబునాయుడికి లోకేష్‌కు ఈ కేసుతో నేరుగా సంబంధాలుండే అవకాశాలున్నాయని తెలిపింది. ఈ మేరకు కొన్ని ఫోటోలను కూడా వైసిపి తనఫేస్‌బుక్‌, ట్విటర్‌ఖాతాల్లో పెట్టింది. శుక్రవారం నాడు కూడా ఈ పరస్పర విమర్శలు కొనసాగాయి. వైసిపి బృందం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదు చేసింది. సంధ్య అక్వా ఎండికి బిజెపికి రాష్ట్ర బిజెపికి చెందిన అగ్రనేతకు సమీప బంధుత్వం ఉన్నట్లు కూడా వస్తున్న వార్తలు చర్చనీయాంశమైనాయి. ఆ అగ్రనేతకు చంద్రబాబునాయుడి కుటుంబానికి కూడా దగ్గరి సంబంధాలు ఉండటం చర్చనీయాంశంగా మారింది. సంధ్యా అక్వాకు మరికొన్ని కంపెనీలు కూడా ఉన్నాయని వాటిలో ఒక దానికి బిజెపి అగ్ర నేతకుమారుడు డైరక్టర్‌గా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే ఇంటర్‌పోల్‌ నుండి సమాచారం వచ్చిన కొన్ని రోజులకుగానీ సిబిఐ అధికారులు దాడులు చేయకపోవడం, దాడి జరిగిన తరువాత రోజుల తరబడి సమాచారాన్ని బయటపెట్టకపోవడం పలు అనుమానాలకు దోవతీస్తుంది. సంధ్యా అక్వా ఎండి ని విమానంలో లైంగిక వేధింపులనేరం కింద 2016లో అరెస్ట్‌ చేసినట్లు చెబుతున్నారు.

విలువ ఎంత…?
విశాఖ పోర్టులో 25 వేల కిలోల డ్రగ్స్‌ పట్టుబడిన సంగతి తెలిసిందే. దీనిని కోకైన్‌గా ప్రాధమికంగా సిబిఐ అధికారులు నిర్దారణ చేసి, ఆ మేరకు రిపోర్టులో కూడా పొందుపరిచారు. దీని విలువను అధికారికంగా ప్రకటించలేదు. అయితే,సుమారుగా 50 వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ప్రస్తుతం విశాఖ కంటైనర్‌ టెర్మినల్‌ జెఎన్‌ బక్షీ అనే ముంబాయి సంస్థ ఆధీనంలో ఉంది. ఆ సంస్థకు, సంధ్యా అక్వాకు మధ్య ఉన్న సంబంధాలేమిటో వెలుగులోకి రాలేదు. కంటైనర్‌ను స్కాన్‌చేసి లోపలి సరుకును నిర్దారించాల్సిఉండగా, ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉండటంలో అది సాధ్యం కావడం లేదని చెబుతున్నారు. దేశంలో ప్రైవేటు పోర్టులు డ్రగ్స్‌కు అడ్డాలుగామారుతున్నాయి. రెండు సంవత్సరాల క్రితం అదాని ముంద్రా పోర్టు నుండి 25 వేల కోట్ల రూపాయల విలువైన కొకైన్‌ను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. విశాఖ పోర్టులో ఈ తరహా వ్యవహారాలు దేశ రక్షణకు హాని కరమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తెలిపింది. ఈ మేరకు కొన్ని ఫోటోలను కూడా వైసిపి తనఫేస్‌బుక్‌, ట్విటర్‌ఖాతాల్లో పెట్టింది. శుక్రవారం నాడు కూడా ఈ పరస్పర విమర్శలు కొనసాగాయి. వైసిపి బృందం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదు చేసింది. సంధ్య అక్వా ఎండికి బిజెపికి రాష్ట్ర బిజెపికి చెందిన అగ్రనేతకు సమీప బంధుత్వం ఉన్నట్లు కూడా వస్తున్న వార్తలు చర్చనీయాంశమైనాయి. ఆ అగ్రనేతకు చంద్రబాబునాయుడి కుటుంబానికి కూడా దగ్గరి సంబంధాలు ఉండటం చర్చనీయాంశంగా మారింది. సంధ్యా అక్వాకు మరికొన్ని కంపెనీలు కూడా ఉన్నాయని వాటిలో ఒక దానికి బిజెపి అగ్ర నేతకుమారుడు డైరక్టర్‌గా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే ఇంటర్‌పోల్‌ నుండి సమాచారం వచ్చిన కొన్ని రోజులకుగానీ సిబిఐ అధికారులు దాడులు చేయకపోవడం, దాడి జరిగిన తరువాత రోజుల తరబడి సమాచారాన్ని బయటపెట్టకపోవడం పలు అనుమానాలకు దోవతీస్తుంది. సంధ్యా అక్వా ఎండి ని విమానంలో లైంగిక వేధింపులనేరం కింద 2016లో అరెస్ట్‌ చేసినట్లు చెబుతున్నారు.

➡️