అట్టహాసంగా డబ్ల్యుపిఎల్‌ ప్రారంభం

Feb 23,2024 22:30 #Sports

ప్రత్యేక ఆకర్షణగా షారుక్‌ ఖాన్‌

బెంగళూరు: టాటా ఉమెన్స్‌ ప్రిమియర్‌ లీగ్‌(డబ్ల్యూపిఎల్‌) 2024 బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమైంది. టోర్నీ ప్రారంభానికి ముందు ప్రారంభోత్సవ వేడుకలు జరిగాయి. బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ ప్రత్యేకంగా ఐదు టీమ్‌ల కెప్టెన్లను పరిచయం చేసుకుని, తనదైన శైలిలో ఆటపాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయెంగే’ సినిమాలోని పాటలకు షారూక్‌ ఐదుజట్ల కెప్టెన్లతో కలిసి స్టెప్పులేశారు. తొలుత ప్రేక్షకులను ఉత్సాహపరుస్తూ సందేశాన్నిచ్చారు. షారుఖ్‌ ఖాన్‌తోపాటు యువ హీరోలు టైగర్‌ ష్రాఫ్‌, వరుణ్‌ ధావన్‌, షాహిద్‌ కపూర్‌, సిద్ధార్థ్‌ మల్హోత్రాలతో కలిసి సందడి చేశారు. యువ హీరోల డ్యాన్స్‌ పెర్ఫార్మెన్స్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. కార్తిక్‌ ఆర్యన్‌ అద్భుత ప్రదర్శనతో ప్రారంభోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. టాస్‌ గెలిచిన ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ బౌలింగ్‌ ఎంచుకోగా.. మెగ్‌ లానింగ్‌ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు తొలిగా బ్యాటింగ్‌కు దిగింది.

➡️