ఆంధ్ర 260/7-కేరళతో రంజీట్రోఫీ మ్యాచ్‌

Feb 16,2024 22:07 #Sports

విశాఖపట్నం: రంజీట్రోఫీ ఎలైట్‌ గ్రూప్‌-బిలో ఆంధ్రప్రదేశ్‌ జట్టు చివరి లీగ్‌ మ్యాచ్‌లో కెప్టెన్‌ రికీ బురు, మహేశ్‌ కుమార్‌ అర్ధసెంచరీలతో రాణించారు. పివిజి-ఎసిఎ స్పోర్ట్స్‌ స్టేడియంలో కేరళతో శుక్రవారం నుంచి ప్రారంభమైన మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్రకు శుభారంభం దక్కలేదు. రేవంత్‌రెడ్డి(0), అశ్విన్‌ హెబ్బర్‌(28), మాజీ కెప్టెన్‌ హనుమ విహారి(24) నిరాశపరిచారు. ఆ తర్వాత మహేశ్‌ కుమార్‌(81), కెప్టెన్‌ రికీ బురు(79) అర్ధసెంచరీలతో బ్యాటింగ్‌లో మెరిసారు. వీరిద్దరి నిష్క్రమణ తర్వాత కరణ్‌ షిండే(43) రాణించినా.. చివర్లో రషీద్‌(0), షోయబ్‌(5) తక్కువ స్కోర్‌కే పెవీలియన్‌కు చేరారు. దీంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర జట్టు 89ఓవర్లలో 7వికెట్లు నష్టపోయి 260పరుగులు చేసింది. కేరళ బౌలర్లు బాసెల్‌ థాంపీ, వైశాఖ చంద్రన్‌కు రెండేసి, అఖిల్‌, జలజ్‌ సక్సేనా, తక్షరుకు ఒక్కో వికెట్‌ దక్కాయి.

➡️