ఆస్ట్రేలియా క్లీన్‌స్వీప్‌

Jan 6,2024 22:30 #Sports

సిడ్నీ: పాకిస్తాన్‌తో జరిగిన మూడు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ను ఆస్ట్రేలియా క్లీన్‌స్వీప్‌ చేసింది. మూడో, చివరి టెస్ట్‌లో ఆస్ట్రేలియా జట్టు 8వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. ఓవర్‌ నైట్‌ స్కోర్‌ 7వికెట్ల నష్టానికి 67పరుగులతో నాల్గోరోజు ఆటను కొనసాగించిన పాకిస్తాన్‌ జట్టు 115పరుగులకు ఆలౌటైంది. రిజ్వాన్‌(28), జమాల్‌(18) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. హేజిల్‌వుడ్‌కు నాలుగు, లియాన్‌కు మూడు, స్టార్క్‌, కమిన్స్‌, హెడ్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. దీంతో ఆస్ట్రేలియా జట్టు 130పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చింది. ఆ లక్ష్యాన్ని ఆసీస్‌ ఖవాజా(0), వార్నర్‌(57)వికెట్లు కోల్పోయి ఛేదించింది. లబూషేన్‌(62నాటౌట్‌), స్మిత్‌(4) మరోవికెట్‌ పడకుండా మ్యాచ్‌ను ముగించారు. పాకిస్తాన్‌ బౌలర్‌ సాజిద్‌ ఖాన్‌కు రెండు వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అమీర్‌ జమాల్‌కు లభించగా.. సిరీస్‌ పాట్‌ కమిన్స్‌కు దక్కింది. ఈ గెలుపుతో డబ్ల్యుటిసి పట్టికలోనూ ఆస్ట్రేలియా అగ్రస్థానానికి ఎగబాకింది. టెస్టుల ఆఖరి ఇన్నింగ్స్‌ ఆడిన వార్నర్‌… కెరీర్‌ ఆఖరి టెస్ట్‌, ఆఖరి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా సీనియర్‌ బ్యాటర్‌ డేవిడ్‌ వార్నర్‌ సత్తా చాటాడు. రెండో ఇన్నింగ్స్‌లో 57పరుగులు చేసి కెరీర్‌ ఆఖరి ఇన్నింగ్స్‌ను ఘనంగా ముగింపు పలికాడు. మొత్తం 75బంతులను ఎదుర్కొన్న వార్నర్‌ 7ఫోర్ల సాయంతో 57పరుగులు చేశాడు. టెస్ట్‌ కెరీర్‌లో భాగంగా ఇప్పటివరకు 112టెస్టులాడిన వార్నర్‌ 44.6 స్ట్రయిక్‌రేట్‌తో 8,786పరుగులు చేశాడు. ఇందులో 37అర్ధసెంచరీలు, 26సెంచరీలతోపాటు మూడు డబుల్‌ సెంచరీలున్నాయి.

➡️