– వార్షిక కాంట్రాక్ట్‌ల పొడిగింపునకు ‘నో’
– యువ క్రికెటర్లకు పెద్దపీట
ముంబయి: భారత క్రికెట్ బోర్డు(బిసిసిఐ) శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లపై కొరడా ఝుళిపించింది. 2023-24 సీజన్‌కు సీనియర్ క్రికెటర్ల వార్షిక ఒప్పందాలను బిసిసిఐ బుధవారం ప్రకటించగా.. అందులో వీరిద్దరికీ చోటు దక్కలేదు. దేశవాళీ టోర్నీల్లో కచ్చితంగా పాల్గనాలని బిసిసిఐ తేల్చిచెప్పినా.. వీరిద్దరూ వేర్వేరు కారణాలను సాకుగా చూపుతూ ఉండడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీంతో ఈసారి ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌ను కాంట్రాక్టుల నుంచి తొలగించింది. దక్షిణాఫ్రికా పర్యటన నుంచి మధ్యలోనే వచ్చేసిన కిషన్ తరువాత జరిగిన ఏ సిరీస్‌లోనూ పాల్గోలేదు. ఐపిఎల్ కోసం హార్దిక్ పాండ్యాతో కలసి ప్రాక్టీస్ చేశాడని వార్తలచ్చాయి. రంజీ ట్రోఫీలో జార్ఖండ్ జట్టు ఆడాలని బిసిసిఐ చెప్పినా ఆడలేదు. ముంబయి తరఫున అస్సాంతో జరిగిన మ్యాచ్‌లో, బరోడాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఆడాలని శ్రేయస్ అయ్యర్‌ను కోరినా అతడూ దూరంగా ఉన్నాడు. దీంతో అతనిపైనా వేటు పడింది.
రోహిత్, కోహ్లీ, బుమ్రా, జడేజా గ్రేడ్-ఎ+లో ఉండగా.. గ్రేడ్-ఎకు రాహుల్, గిల్, సిరాజ్ పదోన్నతి పొందారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి ఏడాదిగా జట్టుకు దూరమైన రిషబ్ పంత్ గ్రేడ్‌లో ఉన్నాడు. టి20 స్పెషలిస్ట్ బ్యాటర్ రింకూసింగ్, తిలక్‌వర్మ కొత్తగా గ్రేడ్-సిలో చోటు దక్కించుకున్నారు. నిర్దేశించిన వ్యవధిలో కనీసం మూడు టెస్టులు కాని, 8 వన్డేలు లేదా 10 టి20లు ఆడితే వారిని కూడా గ్రేడ్‌లో చేరుస్తారు. ఇప్పటికే రెండు టెస్టులు ఆడిన దృవ్ జురెల్, సర్ఫరాజ్ ఇంగ్లండ్‌తో జరిగే ఐదో టెస్ట్‌లోనూ ఆడితో వారి కెరీర్లో ఇది మూడో టెస్టు కానుంది. దీంతో వారు కూడా గ్రేడ్ జాబితాలో చేరే ఛాన్స్ ఉంది. అలాగే సెలెక్షన్ కమిటీ బౌలింగ్ కాంట్రాక్టులకు ఆకాశ్ దీప్, విజయ్ కుమార్ వ్యాషక్, ఉమ్రన్ మాలిక్, యశ్ దయాల్, కావేరప్పను సిఫార్సు చేసింది. ఈ కాంట్రాక్టులు అక్టోబర్ 1, 2023 నుంచి సెప్టెంబర్ 30, 2024 వరకు అమలులో ఉంటుంది. ఫాస్ట్ బౌలింగ్ కాంట్రాక్టును బీసీసీఐ కొత్తగా సిఫార్సు చేసింది. దీనిలో ఆకాశ్‌దీప్, విజరుకుమార్, ఉమ్రాన్ మాలిక్, యశ్ దయాల్, విద్వాంత్ కావేరప్ప ఉన్నారు.
వార్షిక కాంట్రాక్టులో ఉన్న ఆటగాళ్లు వీరే..
గ్రేడ్-ఎ+ : రోహిత్, కోహ్లీ, బుమ్రా,
జడేజాగ్రేడ్-ఎ : అశ్విన్,
షమీ, సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్, హార్దిక్.
గ్రేడ్-బి : సూర్యకుమార్, పంత్, కుల్దీప్, అక్షర్, జైస్వాల్.
గ్రేడ్-సి : రింకూ సింగ్, తిలక్ వర్మ, గైక్వాడ్, శార్దూల్, దూబే, బిష్ణోయ్, జితేష్, సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, అర్ష్‌దీప్, కేఎస్ భరత్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, రజత్ పటీదార్.