క్వార్టర్స్‌కు త్రీసాాగాయత్రి

Mar 21,2024 23:20 #Sports

స్విస్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ
బసెల్‌(స్విట్జర్లాండ్‌): స్విస్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల డబుల్స్‌ క్వార్టర్‌ఫైనల్లోకి యువ షట్లర్లు త్రీసా జోలీ-గాయత్రీ గోపీచంద్‌ ప్రవేశించారు. గురువారం జరిగిన రెండోరౌండ్‌ పోటీలో త్రీసాాగాయత్రి జంట 21-10, 21-12తో సహచర ఆటగాళ్లు ప్రియాామిశ్రాలను చిత్తుచేశారు. ఈ మ్యాచ్‌ కేవలం 36నిమిషాల్లోనే ముగించింది. అంతకుముందు తొలిరౌండ్‌లో 8వ సీడ్‌ త్రీసాాగాయత్రి 21-15, 21-12తో అన్‌సీడెడ్‌, అమెరికాకు చెందిన అన్నోకెర్రీలను చిత్తుచేశారు.

➡️