క్వార్టర్స్‌కు సింధు

Mar 7,2024 22:10 #Sports

ఫ్రెంచ్‌ ఓపెన్‌ సూపర్‌750 బ్యాడ్మింటన్‌ టోర్నీ

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ సూపర్‌750 బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌లో పివి సింధు రాణిస్తోంది. గురువారం జరిగిన ప్రి క్వార్టర్‌ఫైనల్లో సింధు బివెన్‌ జంగ్‌(అమెరికా)పై మూడుసెట్ల హోరాహోరా పోరులో నెగ్గింది. తొలి సెట్‌ను చేజార్చుకున్న సింధు.. ఆ తర్వాత రెండు సెట్లలో పుంజుకొని మ్యాచ్‌ను ముగించింది. హోరాహోరీగా సాగిన ప్రి క్వార్టర్‌పోటీలో సింధు 13-21, 21-10, 21-14తేడాతో బివెన్‌ జంగ్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌ సుమారు 55నిమిషాలసేపు సాగింది. పురుషుల సింగిల్స్‌లోనూ కిదాంబి శ్రీకాంత్‌, లక్ష్యసేన్‌ ప్రి క్వార్టర్స్‌కు చేరగా.. హెచ్‌ఎస్‌ ప్రణయ్ రాయ్ తొలిరౌండ్‌లోనే ఓటమిపాలైన సంగతి తెలిసిందే. మహిళల డబుల్స్‌లోనూ.. మహిళల డబుల్స్‌లోనూ భారత జోడీ క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లారు. త్రీసా జోలీాగాయత్రి గోపీచంద్‌ 21-18, 21-13తో జపాన్‌కు చెందిన యుకీ ఫుకుషిమా-సయాక- హిటోరాను చిత్తుచేశారు. తొలి సెట్‌ను పోరాడి నెగ్గిన భారత యువ జంట.. రెండో సెట్‌ను ఏకపక్షంగా ముగించారు.

➡️